Breaking News: మళ్లీ కరోనా గజ గజా వణికించేందుకు సిద్ధమవుతోంది.. మరోసారి భారీ కేసులు విరుచుకుపడతాయా..? చాలా రోజులుగా ప్రజలు కరోనం భయం (Corona Tension) గురించి మరిచిపోయారు. ఆ మహ్మమారి ఊసే లేక అంతా రిలాక్స్ అవుతున్నారు. అయితే ఊహించని విధగా కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన పెంచుతోంది. దేశ వ్యాప్తంగా రోజువారి కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 2151 కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గతేడాది అక్టోబర్ తరువాత ఒకే రోజు అత్యధికంగా కేసులు (Highest Cases in One Day) నమోదు కావడం ఇదే తొలిసారి.. తాజా కేసులతో కలపి దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్యతో 11 వేలు దాటేసింది. తాజాగా కేసుల సంఖ్య చూస్తుంటే.. మళ్లీ థర్డ్ వేవ్ గుర్తుకు వస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలను కూడా ఈ టెన్షన్ వెంటాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. తాజాగా ప్రకాశం జిల్లలో (Prakkkka) మరో కేసు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో పది రోజుల వ్యవధిలో రెండు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైంది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ. మరోవైపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ పై పలు హెచ్చరికలు జారీ చేయడంతో
కరోనా పరీక్షలు ముమ్మరం చేస్తున్నారు అధికారులు.
తాజా గణంకాలు చూస్తుంటే.. మళ్లీ కోవిడ్ వేవ్ తరహా పరిస్థితి వస్తుందా అనే భయం వెంటాడుతోంది. భారత దేశ వ్యాప్తంగా మంగళవారం కొత్తగా 2,151 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 11,903కి పెరిగింది అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా ఏడుగురు చనిపోవడంతో.. మొత్తం దేశవ్యాప్త కరోనా మరణాల సంఖ్య 5,30,848కి చేరింది. తాజా పరిస్థితి పరిశీలిస్తే నిన్న మహారాష్ట్రలో ముగ్గురు చనిపోగా... కర్ణాటకలో ఒకరు, కేరళలో ముగ్గురు చనిపోయారు.
ఇదీ చదవండి : ఇటు అలంకరణ.. అటు పరాదాలు.. మురికివాడల్ని కప్పేసిన అధికారులు.. ఎందుకంటే..?
ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 1.51 శాతంగా ఉంది. అలాగే వారపు పాజిటివిటీ రేటు 1.53 శాతంగా ఉంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.47 కోట్లకు (4,47,09,676) చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.03 శాతంగా ఉంది. తాజా పరిప్స్థతుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కోవిడ్ వేవ్ సమయంలో పాటించిన జాగ్రత్తలుప్పనిసరిగా పాటించాలని సూచించిందిప. అత్యవసరం అనుకుంటే తప్పా ఎవరూ బయకు వెళ్లొద్దని.. వెళ్లినా జన సమూహంలో మాస్క్ సత్ తప్పని సరిగా వేసుకోవాలని కేంద్రం సూచిస్తోంద
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Corona