చేసిన పాపం ఎప్పటికైనా వెంటాడుతుంది. శిక్ష పడేలా చేస్తుంది. తప్పుచేసి తప్పించుకుంటే ఎప్పటికైనా దొరక్క తప్పదని ఈ ఘటన నిరూపించింది. హత్య చేసి 11 ఏళ్లపాటు హాయిగా బయట తిరిగిన వ్యక్తి.. ఓ చిన్నగొడవ కారణంగా పోలీసులకు చిక్కాడు. 11 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన మర్డర్ మిస్టరీ అనూహ్యరీతిలో వీడింది. వివరాల్లోకి వెళ్తే.., కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని విజయపూర్ జిల్లా వాదావేన్ తాలూకాలోని మధుదేహాల్ కు చెందిన హుచ్చప్ప, ప్రియాంకకు పెళ్లయింది. హచ్చప్ప టీచర్ గా పనిచేస్తుండగా.. ప్రియాంక ఇంటివద్దే ఉండేది. కొన్నాళ్ల పాటు ఇద్దరి కాపురం సజావుగానే సాగింది. ఐతే ప్రియాంక ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న హచ్చప్ప పద్ధతి మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడు.
అయినా వినిపించుకొని ప్రియాంక.. తన ప్రియుడితో కలిసి తిరగడం మానలేదు. దీంతో భార్యను ఎలాగైనా అంతమొందించాలని స్కెచ్ వేశాడు. ఈ క్రమంలో 2011 జూలైలో శ్రీశైలం ఆలయానికి వెళ్దామంటూ భార్యను తీసుకెళ్లాడు. అదే రోజు అర్దరాత్రి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా (Prakasham District) పెద్దదోర్నాల మండలంలోని కొర్రప్రోలు సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి.. తన సోదరుడితో కలిసి నైలాన్ తాడుతో ప్రియాంక గొంతుకు బిగించి హత్య చేశాడు. తర్వాత మృతదేహం ఒంటిపై దుస్తులు తీసేసి రోడ్డుపక్కనే ఉన్న కల్వర్టు కిందపడేసి వెళ్లిపోయారు.
ఐతే ఈ విషయం ప్రియాంక తల్లిదండ్రులకు తెలిసినా ఆమె ప్రవర్తనతో విసిగిపోయి మౌనంగా ఉన్నారు. ఐతే స్నేహితులు, బంధువులు భార్య గురించి ఆరాతీయగా.. అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్లిపోయిందని నమ్మించాడు. అప్పట్లో ప్రియాంక మృతదేహంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎలాంటి క్లూ దొరక్కపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు.
హచ్చప్ప భార్యను చంపేశాడని అందరికీ తెలిసినా.. 11 ఏళ్లుగా మౌనంగా ఉన్నారు. ఐతే ఇటీవల హచ్చప్పకు, అతడి దాయాదులకు మధ్య ఆస్తిపంపకాల్లో తేడారావడంతో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో హచ్చప్ప.. భార్యను హత్య చేసిన విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో గతేడాది జూన్ 1న మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను విచారించగా హత్య చేసినట్లు అంగీకరించారు. మర్డర్ చేసిన చేసిన తీరుతో పాటు ఎక్కడ చంపిందీ.., ఎలా చంపింది అనే వివరాలను బయటపెట్టారు.
దీంతో కర్ణాటక పోలీసులు పెద్దదోర్నాల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితులను అరెస్ట్ చేశారు.11 ఏళ్లపాటు హత్య చేసి తప్పించుకున్న హచ్చప్ప.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మృతురాలు ఏపీకి చెందిన వ్యక్తి కాకపోవడం, నిందితులు కర్ణాటకలో ఉండటంతో కేసును ఛేదించడం పోలీసులకు కష్టమైంది. ఐతే ఆస్తిగొడవ కారణంగా 11 ఏళ్ల తర్వాత హంతకులు కటకటాల్లోకి వెల్లారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Prakasham dist