హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

సతి ప్రాణాన్ని రక్షించిన పతి.. భార్యను కాపాడి భర్త మృతి...!

సతి ప్రాణాన్ని రక్షించిన పతి.. భార్యను కాపాడి భర్త మృతి...!

మద్దిపాడు మండలం ఏడు గుండ్లపాడుకు చేరుకున్న క్రమంలో నరసింహారావు ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే తన ఆరోగ్య స్థితిని గమనించిన నరసింహారావు రహదారి పక్కకు కారును తీసుకువెళ్లి నిలిపివేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Prakasam, India

తాను చనిపోతున్నా కూడా భార్య ప్రాణాల్ని కాపాడి భర్త చనిపోయిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.  కారు నడుపుతూ...గుండెపోటుకు గురై భర్త మృతి చెందాడు. తన తుది శ్వాస విడిచే క్రమంలోనూ, భార్య ప్రాణాన్ని భర్త రక్షించిన ఘటన మద్దిపాడు మండలం ఏడుగుండ్ల పాడు వద్ద గురువారం జరిగింది. వివరాలలోకి వెళితే... తిరుపతి నుండి రాజమండ్రి కి తిరుపతికి చెందిన నరసింహారావు తన భార్యతో కలిసి గురువారం కారులో బయలుదేరారు.

అయితే కారు ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు మండలం ఏడు గుండ్లపాడుకు చేరుకున్న క్రమంలో నరసింహారావు ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే తన ఆరోగ్య స్థితిని గమనించిన నరసింహారావు రహదారి పక్కకు కారును తీసుకువెళ్లి నిలిపివేశారు. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది హుటాహుటిన నరసింహారావును కాపాడే ప్రయత్నం చేశారు.

అనంతరం ఒంగోలు వైద్యశాలకు తరలించిన క్రమంలో అప్పటికే నరసింహారావు మృతి చెందారు. తాను చనిపోతూ తన ప్రాణాన్ని రక్షించిన నరసింహారావు మృతదేహంపై, అతని భార్య వినిపించిన తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. ఈ వార్త అందర్నీ కలిచి వేస్తుంది.

First published:

Tags: AP News, Ongole, Telangana News

ఉత్తమ కథలు