Home /News /andhra-pradesh /

PRAKASAM IS THE BIG DISTRICT AND VISAKHA IS THE SMALEST DISTRICT THESE IS THE NEWS DISTRICT HISTORY NGS

AP New Districts Names: కొత్త జిల్లాల స్వరూపం ఇదే.. పెద్దదిగా ప్రకాశం.. చిన్న జిల్లా ఏదంటే..?

ఏపీలో కొత్త జిల్లాల స్వరూపం ఇదే

ఏపీలో కొత్త జిల్లాల స్వరూపం ఇదే

AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీ స్వరూపం మారిపోతోంది. 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అవుతున్నాయి. అయితే అందులో మొన్నటి వరకు పెద్ద జిల్లా కాస్త ఇకపై చిన్న జిల్లాగా మారుతోంది. మరోటి చిన్నజిల్లా కాస్త పెద్దతి అవుతోంది..

    AP New Districts:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కొత్త జిల్లాలకు (AP New District) కేబినెట్ లో ఆమోదం తెలపడం.. ఆ వెంటనే గవర్నర్ కు పంపడం.. నోటిఫికేషన్ జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం 13 జిల్లాలు గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇకపై 26 జిల్లాలుగా మారనుంది.  ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తోంది. మొత్త 25 లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా.. అరుకును రెండుగా చేస్తున్నారు.  దీంతో మొత్తం 26 జిల్లాలకు నోటిఫికే,న్ ఇచ్చింది. కొత్త జిల్లాలపై 30 రోజుల్లో అభ్యంతరాలు సేకరించి తదుపరి ప్రక్రియను మొదలుపెడతారు. ఉగాది (Ugadi) నాటికి ప్రక్రియను పూర్తి చేసి కొత్త జిల్లాలను అమలులోకి తెచ్చేలా ఏపీ ప్రభుత్వం  (AP Government)కసరత్తు చేస్తోంది.

    ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాల పరిధిలో 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 51 రెవెన్యూ డివిజన్లు, 670 మండలాలు ఉన్నాయి. వాటిని 26 జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం పునర్విభజించింది. దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రెడీ అయ్యింది. ఈ పునర్వ్యవస్థీకరణ తరువాత కొన్ని జిల్లాల స్వరూపం మారిపోతోంది. ప్రకాశం జిల్లా (Praksam District) పెద్ద జిల్లాగా మారనుంది. విశాఖ చిన్న జిల్లా కానుంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రకాశం అతి పెద్ద జిల్లాగా అవతరించనుంది. 928 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విశాఖపట్నం (Visakhapatnam) అతి చిన్న జిల్లాగా ఉండనుంది. జనాభా పరంగా చూస్తే కర్నూలు 23.66 లక్షల జనాభాతో పెద్ద జిల్లా అవుతుంది. అతి తక్కువగా 9.54 లక్షల జనాభాతో అరకు చిన్న జిల్లాగా ఉంది. రెండు గిరిజన జిల్లాలు అల్లూరి, మన్యం.. ఏర్పాటు కానున్నాయి. అల్లూరి జిల్లాలో అతి తక్కువగా 3 నియోజకవర్గాలు ఉన్నాయి.

    కొత్త జిల్లాల స్వరూపం ఇదే..

    జిల్లా పేరు: శ్రీకాకుళం.. ముఖ్య కేంద్రం: శ్రీకాకుళం
    నియోజకవర్గాలు: 8(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
    రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16)

    మొత్తం మండలాలు 30.
    వైశాల్యం: 4,591 చ.కి.మీ
    జనాభా: 21.91 లక్షలు

    జిల్లా పేరు: విజయనగరం.. ముఖ్య కేంద్రం: విజయనగరం
    నియోజకవర్గాలు: 7 (రాజాం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట)
    రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి(11), విజయనగరం(15)

    మొత్తం మండలాలు 26
    వైశాల్యం : 3,846 చ.కి.మీ
    జనాభా: 18.84 లక్షలు

    జిల్లా పేరు: మన్యం.. ముఖ్య కేంద్రం: పార్వతీపురం
    నియోజకవర్గాలు: 4(పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు)
    రెవెన్యూ డివిజన్లు: పాలకొండ(6),పార్వతీపురం(10)

    మొత్తం మండలాలు 16
    వైశాల్యం: 3,935 చ.కి.మీ
    జనాభా: 9.72లక్షలు

    జిల్లా పేరు: అల్లూరి సీతారామరాజు.. ముఖ్య కేంద్ర : పాడేరు  నియోజకవర్గాలు: 3 (పాడేరు, అరకు,రంపచోడవరం)                              రెవెన్యూ డివిజన్లు: కొత్తగా పాడేరు(11), రంపచోడవరం(11)
    మొత్తం మండలాలు 22                                                                                వైశాల్యం : 12,251 చ.కి.మీ                                                                              జనాభా : 9.54 లక్షలు

    జిల్లా పేరు: విశాఖపట్నం.. ముఖ్య కేంద్రం: విశాఖపట్నం

    నియోజకవర్గాలు: 6 (భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక)
    రెవెన్యూ డివిజన్లు: కొత్తగా భీమునిపట్నం(5), విశాఖపట్నం(5) మొత్తం మండలాలు 10
    వైశాల్యం : 928 చ.కి.మీ
    జనాభా : 18.13 లక్షలు

    జిల్లా పేరు: అనకాపల్లి.. ముఖ్య కేంద్రం: అనకాపల్లి
    నియోజకవర్గాలు: 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి)
    రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం(10),అనకాపల్లి(15) మొత్తం మండలాలు 25
    వైశాల్యం : 4,412 చ.కి.మీ,
    జనాభా : 18.73 లక్షలు

    జిల్లా పేరు: తూర్పుగోదావరి.. ముఖ్య కేంద్రం: కాకినాడ
    నియోజకవర్గాలు: 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం)
    రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం(12),కాకినాడ(7) మొత్తం మండలాలు 19
    వైశాల్యం : 2,605 చ.కి.మీ
    జనాభా : 19.37 లక్షలు

    జిల్లా పేరు: కోనసీమ.. ముఖ్య కేంద్రం: అమలాపురం
    నియోజకవర్గాలు: 7 (రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం,అమలాపురం, రాజోలు, పి.గన్నవరం)
    రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం(8), అమలాపురం(16) మొత్తం మండలాలు 24
    వైశాల్యం: 2,615 చ.కి.మీ
    జనాభా: 18.73 లక్షలు

    జిల్లా పేరు: రాజమహేంద్రవరం.. ముఖ్య కేంద్రం: రాజమహేంద్రవరం
    నియోజకవర్గాలు: 7 (అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)
    రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం(10), కొవ్వూరు(10) మొత్తం మండలాలు 20
    వైశాల్యం: 2,709 చ.కి.మీ
    జనాభా: 19.03 లక్షలు

    జిల్లా పేరు: నరసాపురం.. ముఖ్య కేంద్రం: భీమవరం
    నియోజకవర్గాలు: 7 (ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు,తాడేపల్లిగూడెం)
    రెవెన్యూ డివిజన్లు: నరసాపురం(8), కొత్తగా భీమవరం(11) మొత్తం మండలాలు 19
    వైశాల్యం: 2,178 చ.కి.మీ
    జనాభా: 17.80 లక్షలు

    జిల్లా పేరు: పశ్చిమగోదావరి.. ముఖ్య కేంద్రం: ఏలూరు
    నియోజకవర్గాలు: 7 (ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు)
    రెవెన్యూ డివిజన్లు: ఏలూరు(12),జంగారెడ్డిగూడెం(9), నూజివీడు(6) మొత్తం మండలాలు 27
    వైశాల్యం: 6,413 చ.కి.మీ
    జనాభా: 20.03 లక్షలు

    జిల్లా పేరు: కృష్ణా.. ముఖ్య కేంద్రం: మచిలీపట్నం
    నియోజకవర్గాలు: 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ)
    రెవెన్యూ డివిజన్లు: గుడివాడ (13), మచిలీపట్నం(12) మొత్తం మండలాలు 25
    వైశాల్యం: 3,775 చ.కి.మీ
    జనాభా: 17.35 లక్షలు

    జిల్లా పేరు: ఎన్టీఆర్.. ముఖ్య కేంద్రం: విజయవాడ
    నియోజకవర్గాలు: 7 (విజయవాడ పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు)
    రెవెన్యూ డివిజన్లు: విజయవాడ(6), కొత్తగా నందిగామ(7), కొత్తగా తిరువూరు(7) మొత్తం మండలాలు 20
    వైశాల్యం: 3,316 చ.కి.మీ
    జనాభా: 22.19 లక్షలు

    జిల్లా పేరు: గుంటూరు.. ముఖ్య కేంద్రం: గుంటూరు
    నియోజకవర్గాలు: 7 (తాడికొండ, గుంటూరు పశ్చిమ, మధ్య, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి)
    రెవెన్యూ డివిజన్లు: గుంటూరు (10), తెనాలి (8) మొత్తం 18 మండలాలు
    వైశాల్యం: 2,443 చ.కి.మీ
    జనాభా: 20.91 లక్షలు

    జిల్లా పేరు: బాపట్ల.. ముఖ్యకేంద్రం: బాపట్ల
    నియోజకవర్గాలు : 6 (వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల)
    రెవెన్యూ డివిజన్లు : కొత్తగా బాపట్ల(12), కొత్తగా చీరాల (13) మొత్తం మండలాలు 25
    వైశాల్యం : 3,829 చ.కి.మీ
    జనాభా : 15.87 లక్షలు

    జిల్లా పేరు: పల్నాడు.. ముఖ్యకేంద్రం: నరసరావుపేట
    నియోజకవర్గాలు : 7 (పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి)
    రెవెన్యూ డివిజన్లు : గురజాల (14), నరసరావుపేట(14) మొత్తం మండలాలు 28
    వైశాల్యం : 7,298 చ.కి.మీ
    జనాభా : 20.42 లక్షలు

    జిల్లా పేరు: ప్రకాశం.. ముఖ్య కేంద్రం: ఒంగోలు
    నియోజకవర్గాలు : 8 (యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి)
    రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం(13), ఒంగోలు(12), కొత్తగా కనిగిరి (13) మొత్తం మండలాలు 38
    వైశాల్యం : 14,322 చ.కి.మీ
    జనాభా : 22.88 లక్షలు

    జిల్లా పేరు: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు.. ముఖ్య కేంద్రం: నెల్లూరు
    నియోజకవర్గాలు : 8 (కొవ్వూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు)
    రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు (12), ఆత్మకూరు (11), కావలి(12) మొత్తం మండలాలు 35
    వైశాల్యం : 9,141 చ.కి.మీ
    జనాభా : 23.37 లక్షలు

    జిల్లా పేరు: కర్నూలు.. ముఖ్యం కేంద్రం: కర్నూలు
    నియోజకవర్గాలు : 8 (పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు )
    రెవెన్యూ డివిజన్లు : కర్నూలు (11), ఆదోని (17) మొత్తం మండలాలు 28
    వైశాల్యం : 8,507 చ.కి.మీ
    జనాభా : 23.66 లక్షలు

    జిల్లా పేరు: నంద్యాల.. ముఖ్యకేంద్రం: నంద్యాల
    నియోజకవర్గాలు : 6 (నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు)
    రెవెన్యూ డివిజన్లు : నంద్యాల (9), కొత్తగా డోన్‌ (8), కొత్తగా ఆత్మకూరు(10) మొత్తం మండలాలు 27
    వైశాల్యం : 9,155 చ.కి.మీ
    జనాభా : 16.87 లక్షలు

    జిల్లా పేరు: అనంతపురం.. ముఖ్య కేంద్రం: అనంతపురం
    నియోజకవర్గాలు : 8 (రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, గుంతకల్‌)
    రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం (12), అనంతపురం (14), కొత్తగా గుంతకల్‌(8) మొత్తం మండలాలు 34
    వైశాల్యం : 11,359 చ.కి.మీ
    జనాభా : 23.59 లక్షలు

    జిల్లా పేరు: శ్రీసత్యసాయి.. ముఖ్య కేంద్రం: పుట్టపర్తి
    నియోజకవర్గాలు : 6 (మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి)
    రెవెన్యూ డివిజన్లు : పెనుగొండ (13), కొత్తగా పుట్టపర్తి(8), కదిరి (8) మొత్తం మండలాలు 29
    వైశాల్యం : 7,771 చ.కి.మీ
    జనాభా : 17.22 లక్షలు

    జిల్లా పేరు: వైఎస్సార్‌ కడప.. ముఖ్య కేంద్రం: కడప
    నియోజకవర్గాలు : 7 (కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు)
    రెవెన్యూ డివిజన్లు : కడప(10), జమ్మలమడుగు(12), కొత్తగా బద్వేలు (12) మొత్తం మండలాలు 34
    వైశాల్యం : 10,723 చ.కి.మీ
    జనాభా : 19.90 లక్షలు

    జిల్లా పేరు: అన్నమయ్య.. ముఖ్య కేంద్రం: రాయచోటి
    నియోజకవర్గాలు : 6 (రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి)
    రెవెన్యూ డివిజన్లు : రాజంపేట (11), కొత్తగా రాయచోటి(10), మదనపల్లి(11) మొత్తం మండలాలు 32
    వైశాల్యం : 8,459 చ.కి.మీ
    జనాభా : 17.68 లక్షలు

    జిల్లా పేరు: చిత్తూరు.. ముఖ్య కేంద్రం: చిత్తూరు
    నియోజకవర్గాలు : 7 (నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు)
    రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు(18), కొత్తగా పలమనేరు, (15) మొత్తం మండలాలు 33
    వైశాల్యం : 7,210 చ.కి.మీ
    జనాభా : 19.85 లక్షలు

    జిల్లా పేరు: శ్రీ బాలాజీ.. ముఖ్య కేంద్రం: తిరుపతి
    నియోజకవర్గాలు : 7 (సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి)
    రెవెన్యూ డివిజన్లు : నాయుడుపేట(13), గూడూరు (11), తిరుపతి (11) మొత్తం మండలాలు 35
    వైశాల్యం : 9,176 చ.కి.మీ
    జనాభా : 22.18 లక్షలు
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు