Shaik Salam, News18, Ongole
కొందరు క్షణికావేశంలో ప్రవర్తించే తీరు ఊహించని నష్టాన్ని మిగుల్చుతుంది. కావాలని చేయకపోయినా చేసిన తప్పుకు భయం, పశ్చాత్తాపం వెంటాడతాయి. వాటిని తట్టుకొని నిలబడితే సరే లేదంటే ప్రాణనష్టం తప్పదు. ఇలా భార్య మృతికి కారణమయ్యాననే భావనతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు లోని విరాట్ నగర్ లో అంజిరెడ్డి అతని భార్య పూర్ణిమలు నివాసం ఉంటున్నారు. అప్పుడప్పుడు వీరి మధ్య చిన్న, చిన్న తగాదాలు చోటు చేసుకొనేవి. ఈ క్రమంలో 27వ తేదీన సాయంత్రం వీరి మధ్య చిన్న ఘర్షణ ఏర్పడగా, అంజిరెడ్డి ఆవేశంతో చపాతీ కర్రతో పూర్ణిమ పైదాడికి పాల్పడ్డాడు.
దీనితో భార్యకు తీవ్ర రక్తస్రావం కావడంతో కంగారుపడ్డ భర్త అంజిరెడ్డి వెంటనే ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు తరలించాడు. అప్పటికే పూర్ణిమ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య మృతికి కారకుడయ్యాడనే భావనతో అంజిరెడ్డి సైతం కొత్తపట్నం వద్ద సముద్రంలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం సముద్రం ఒడ్డు వద్ద మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లులున్నారు.
కాగా ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్ లో వీరి సమీప బంధువు ఆదినారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను పోలీసులు, బంధువులకు అప్పగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Ongole, Prakasham dist