హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Prehistoric Cave : నల్లమలలో వెలుగులోకొచ్చిన ఆదిమానవుల గృహాలు .. ఎన్ని ఏళ్ల నాటివో తెలుసా..?  

Prehistoric Cave : నల్లమలలో వెలుగులోకొచ్చిన ఆదిమానవుల గృహాలు .. ఎన్ని ఏళ్ల నాటివో తెలుసా..?  

prehistoric cave

prehistoric cave

Prehistoric Cave: ప్రాచీన కాలానికి చెందిన గుహ నల్లమలలో బయటపడింది. రాతి బండల్లో 13 వందల ఏళ్ల కిందటి తెలుగు శాసనాన్ని పోలిన రాతలను గుర్తించారు. ఆ ప్రాంతంలోనే ఆదిమానవుల ఆవాసాలను గుర్తించారు. అక్కడ కొండ రాళ్లమీద కొన్ని అక్షరాలు కూడా ఉన్నట్లుగా గుర్తించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Prakasam, India

(AnnaRaghu,Sr.Correspondent,Amaravathi,News18)

పూర్వం ఋషులు, మహర్షులు తమ ప్రయాణాన్ని కొనసాగించేందుకు, నివాస స్థలాలుగా కొండల్లో గృహాలను ఉపయోగించేవారు. ఆదిమానవులు సైతం క్రూర జంతువులతో పాటు వాతావరణ పరిస్థితుల నుండి రక్షణ పొందడానికి కొండ గృహాలను ఉపయోగించేవారు. ఆ తర్వాత కాలంలో రాజులు, మహారాజులు తమ కోటకు దగ్గరలో కొండ గుహ మార్గాలను ఏర్పాటు చేసుకొని శత్రువులు దాడి చేయడానికి వచ్చినప్పుడు దొంగ దెబ్బ తీయడానికి, తలదాచుకోవడంతో పాటు తమ విలువైన సంపదను తరలించేందుకు వాడేవారు. ఇప్పుడు అలాంటి ఓ ప్రాచీన కాలానికి చెందిన గుహ(Prehistoric cave) నల్లమల(Nallamala)లో బయటపడింది.

Tirumala: దేశంలోనే టాప్‌ టూ ప్లేస్‌కి తిరుమల ఆలయం శ్రీవారి ఆలయం .. ఎందులోనో తెలుసా..?

ప్రకాశం జిల్లాలో మరో గుహ..

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మొహిద్దినపురం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం లో ఉన్న జంపలేరు వాగు సమీపంలో ఓ గుహ మార్గం బయటి ప్రపంచానికి తెలిసింది. దీన్ని ప్రకాశం జిల్లా కంభం మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన  చరిత్ర అధ్యాపకురాలు కందుల సావిత్రి గుర్తించారు. నల్లమలలో ఒక కొండ శిఖరం మీద క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటి బౌద్ధ స్థూపాన్ని కనుగొన్న చరిత్ర పరిశోధకురాలిగా కందుల సావిత్రి ఇటీవల వార్తల్లోకి నిలిచారు. జిల్లాలోని కంభం మండలంలోని భైరవ కొండమీదకు ఆమె చేసిన ప్రయాణం కొత్త చారిత్రక ఆవిష్కరణలకు నాంది పలికింది.

ఆదిమానవుల ఆవాసం..

రాతి బండల్లో 13 వందల ఏళ్ల కిందటి తెలుగు శాసనాన్ని వెలికితీసిన ఆమె... ఆ ప్రాంతంలోనే ఆదిమానవుల ఆవాసాలనూ గుర్తించారు.అక్కడ కొండ రాళ్లమీద కొన్ని అక్షరాలు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. అవన్నీ ఏదో పురాతన చరిత్రను చెబుతున్నట్టు ఉన్నాయని సావిత్రి తెలిపారు. అయితే అవి చరిత్ర రాతలన్నది తన ఊహ మాత్రమేనని అందుకు శాస్త్రీయ నిర్ధారణ కావాలి. కాబట్టి ఆ ఫోటోలను మైసూర్‌లోని పురావస్తు శాఖ (ఎపిగ్రఫీ) డైరెక్టర్‌ మునిరత్నంకు పంపించారు.అయితే రాతి శాసనంలో ఉన్న అక్షరాలు 8వ శతాబ్దం నాటి తెలుగు లిపి అని కేంద్ర పురావస్తుశాఖ డైరెక్టర్‌ మునిరత్నంరెడ్డి తేల్చి చెప్పినట్లుగా సావిత్రి వివరించారు.

గుహకు రెండు ద్వారాలు..

జిల్లాలోని అర్ధవీడు మండలం మొహిద్దినపురం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం లో ఉన్న జంపలేరు వాగు సమీపంలో ఈ గుహ గుర్తించారు. తాము గతంలో గుర్తించిన నల్లమల అడవిలోని  బైరవ కొండ సమీపంలో గుర్తించిన గుహకు ఇప్పుడు తాము గుర్తించిన గుహనుండి వెళ్లవచ్చని సావిత్రి తెలిపారు. బౌద్ధస్థూపం నుంచి తూర్పు వైపు కిలోమీటరు ఎత్తున్న ఒక కొండ ఎక్కిన తర్వాత ఓ గుహ కనిపించిందని పెద్ద బండరాయికి ఒకవైపు ప్రవేశ మార్గం ఉన్నట్లుగా తెలిపారు. మరోవైపుబయటకు వచ్చే దారి కూడా ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఈ గుహ లోపలికి వెళ్లాంటే బాగా వంగి లోపలకు వెళ్లాలి.

NTR District: జడ్పీహెచ్లో ఘనంగా గణిత దినోత్సవం..

పర్యాటక ప్రాంతంగా మారాలి..

అయితే ఇప్పుడు గుర్తించిన గుహ లోపల ఎంత దూరం ఉందో తెలీదని తాము మాత్రం 15 అడుగులకు మించి వెళ్లలేకపోయామన్నారు సావిత్రి. గుహలో ఉన్న అవశేషాలను బట్టి... అది వేల ఏళ్ల నాటి ఆదిమానవుల ఆవాసంగా అనిపించిందన్నారు. ఈ గుహ నుంచి శ్రీశైలం, మహానందితో పాటు ఐదు పుణ్యక్షేత్రాలకు సొరంగ మార్గాలు ఉన్నాయని ఇక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. ఇక్కడినుండి గుహ ఎక్కడి వరకు ఉంటుంది..? దాని అంతం ఏది దానిని కూడా గుర్తించాలని సావిత్రి చేసిన కసరత్తులు ఫలించి బెలుం గుహలు, బొర్రా గుహలు మాదిరిగా నల్లమల అడవిలోని గుహలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకు ఓ పర్యాటక ప్రదేశంగా, పురాతన నిర్మాణంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు. అదే విధంగా చేస్తే నల్లమలలోని గుహ చరిత్ర విశ్వవ్యాప్తమవుతుందని కందుల సావిత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

First published:

Tags: Andhra pradesh news, History, Prakasham dist

ఉత్తమ కథలు