హిజ్రాల చర్యలు రాను రాను హేయంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు ప్రయాణికుల్ని, వ్యాపారస్తుల్ని, వాహనదారుల్ని అడ్డగించి డబ్బులు వసూలు చేసుకునే వాళ్లు కాస్తా ఇప్పుడు బరి తెగించారు. రోడ్లపై వెళ్లే వారిని తమ మాయ మాటలతో ట్రాప్‌లోకి లాక్కొని వారిని నిలువు దోపిడీ చేయడం, ఆ తర్వాత భయపెట్టి బ్లాక్ మెయిల్(Blackmail)చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)లోని ప్రకాశం (Prakasam)జిల్లాలో కొందరు హిజ్రాలు(Hijras)ఓ వ్యక్తిని అలాగే తమ ముగ్గులోకి దింపి...కిడ్నాప్ చేశారు. గత నెల 30వ తారికున ఓ రెస్టారెంట్(Restaurant)నుంచి ఇంటికి వెళ్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తిని కొందరు హిజ్రాలు మాటలు చెబుతూ ఆటో దగ్గరకు తీసుకెళ్లి..అందులో బలవంతంగా ఎక్కించారు. సీన్ కట్ చేస్తే హిజ్రాలు సదరు బాధితుడ్ని ఓ లాడ్జిలో బంధించారు. మొదట అతని దగ్గరున్న విలువైన వస్తువులు, డబ్బులు తీసుకొని తర్వాత మరో అరాచకానికి పాల్పడ్డారు.
హిజ్రాల చేతిలో బుక్..
ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే 50సంవత్సరాల వ్యక్తి న్యూఇయర్‌కి రెండ్రోజుల ముందు హిజ్రాల చేతిలో తీవ్రంగా నష్టపోయాడు. బెంగుళూరులో జాబ్ చేస్తున్న వ్యక్తి న్యూఇయర్ సందర్భంగా స్వగ్రామం వచ్చి హిజ్రాల చేతిలో బుక్కయ్యాడు. డిసెంబర్ 30వ తేదిన ఓ హోటల్‌లో డిన్నర్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు హిజ్రాలు అతడ్ని అటకాయించారు. తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికి మాటల్లో పెట్టి ఆటోలో బలవంతంగా ఓ లాడ్జీకి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత శ్రీనివాస్‌రావు సెల్‌ఫోన్, వాచ్‌తో పాటు విలువైన వస్తువులు తీసుకన్నారు.
బ్లాక్ మెయిల్..
ఆపైన అతడ్ని ఆ రాత్రికి గదిలోనే బంధించారు. సెల్‌ఫోన్‌తో నగ్నంగా వీడియోలు, ఫోటోలు తీశారు.వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసారు. డబ్బులు కావాలని కోరడంతో యూపీఐ పేమెంట్స్ ద్వారా సుమారు 4లక్షల రూపాయలు హిజ్రాల అకౌంట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేయించాడు. బాధితుడు శ్రీనివాస్ దగ్గర నుంచి ఇక డబ్బులు రావని తెలుసుకొని అతడ్ని అక్కడే వదిలి పారిపోయారు హిజ్రాల గ్యాంగ్.
ఆలస్యంగా వెలుగులోకి..
హిజ్రాల చేతిలో అవమానానికి గురవడమే కాకుండా...ఆర్దికంగా నష్టపోయిన బాధితుడు శ్రీనివాస్ అశోక్‌నగర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హిజ్రాలు తీసుకెళ్లిన హోటల్ వివరాలు, పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్‌ని సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని నిందితుల్ని పట్టుకుంటామని తెలిపారు ప్రకాశం జిల్లా పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Crime news, Transgender