Fact Check: పులి (Tiger) ని వేటాడం గురించి అందరం వినే ఉంటాం.. అయితే చూడాలి అంటేనే భయపడే పులిని చంపి.. దానిని వండుకొని తినడం గురించి ఎప్పుడైనా విన్నారా..? చూడడానికే భయమేసే.. పులిని ఎలా వండుకుతిన్నారు. కానీ ప్రకాశం జిల్లా (Prakasam District) అక్కపాలెం వాసులు పులిని చంపుకుతిన్నారంటూ అంటూ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ నెల 10న ఎర్రగొండపాలెంలో ఆడపులి పాదముద్రలను అటవీ సిబ్బంది గుర్తించారు. దీంతో పులి ఆచూకీని తెలుసుకునేందుకు అదే రోజు ట్రాప్ కెమెరాలు అమర్చారు. పులి సంచారం గురించి సమీప ప్రాంతాల ప్రజలకు తెలియజేస్తూ ఆరుబయట ఎవరూ నిద్రపోవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పంటలను కాపాడుకోవలనే ఉద్దేశంతో పొలం చుట్టూ రైతులు వేసిన కంచె తగిలి పులి మరణించింది. విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు పులి మాంసాన్ని వండుకుని తిన్నారని.. అయితే పులి గోళ్ల పంపకాల విషయంలో వారి మధ్య విబేధాలు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది అంటూ ఓ వార్త వైరల్ అయ్యింది.
పులిని చంపుకు తినే వార్త వైరల్ అవ్వడంతో.. ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు. 12 మంది పులి మాంసం తిన్నారు అని స్థానికులు చెబుతుండడంతో వారిని విచారించారుు. మూడు రోజుల పాటు గ్రామంలోనే ఉండి వారందిరినీ రహస్యంగా వివరించిన తరువాత.. అసలు వాస్తవంపై ఫారెస్ట్ అధికారులు క్లారిటీ ఇచ్చారు.
పులిని చంపుకుని తిన్నారు అన్నవార్తలు అన్నీ వదంతులేనని యర్రగొండపాలెం అటవీ క్షేత్రాధికారులు తెలిపారు. అక్కపాలెం సమీపంలోని అడవిలోని నీటి కుంట దగ్గరకు పది రోజుల క్రితం మూడు పులులు వచ్చి వెళ్లినట్టు గుర్తించామన్నారు. దీంతో చుట్టు పక్కల రైతులను అప్రమత్తం చేశామన్నారు. పులిని వండుకుని తిన్నారన్న వార్తలపై అన్ని కోణాల్లోనూ విచారణ చేశామన్నారు. వారి ఇళ్లల్లోనూ సోదాలు చేశామని, ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని వివరించారు.
ఇదీ చదవండి : టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు తిడితే వదిలేస్తానా.. వంశీ సంచలన వ్యాఖ్యలు
పులిని వండుకు తినకపోయినప్పటికీ.. గ్రామస్థులు మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో పులులు ఉన్నాయని అధికారులు ప్రకటించారు. అంతేకాదు వాటిని పట్టుకోవడానికి ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రోజులు గడుస్తున్నా వాటి ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామస్థులు భయం భయంతో బతుకుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Prakasam, Tiger