Home /News /andhra-pradesh /

PRAKASAM DISTRICT COLLECTOR RESPONDS TO NEWS18 STORY RS 5 CRORE GOVERNMENT LAND IS SAFE NOW BA

News18 Impact: న్యూస్‌18 కథనానికి కలెక్టర్ స్పందన.. ఒంగోలులో రూ.5కోట్ల ప్రభుత్వ భూమి సేఫ్

ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేసిన దృశ్యం

ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేసిన దృశ్యం

‘టీడీపీ, వైసీపీ నీకింత.. నాకింత. రూ.5 కోట్ల ప్రభుత్వ హాం ఫట్’ అంటూ.. మే 2న న్యూస్ 18 ఓ ప్రత్యేక కథకాన్ని ప్రచురించింది. ఈ స్టోరీపై ప్రకాశం జిల్లా కలెక్టర్ వాడరేవు వినయ్ చంద్ స్పందించారు.

  బాధ్యతాయుతమైన జర్నలిజంతో న్యూస్18 ప్రచురించిన ఓ కథనానికి భారీ స్పందన వచ్చింది. న్యూస్‌18 రాసిన ఓ కథనం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగింది. న్యూస్‌18 రాసిన కథనంపై కలెక్టర్ వెంటనే స్పందించి రూ.5కోట్ల విలువైన భూమి ప్రభుత్వం చేజారకుండా ఆపగలిగారు. ‘టీడీపీ, వైసీపీ నీకింత.. నాకింత. రూ.5 కోట్ల ప్రభుత్వ హాం ఫట్’ అంటూ.. మే 2న న్యూస్ 18 ఓ ప్రత్యేక కథకాన్ని ప్రచురించింది. ఈ స్టోరీపై  ప్రకాశం జిల్లా కలెక్టర్ వాడరేవు వినయ్ చంద్ స్పందించారు. ఇన్నాళ్లూ మాది కాదంటే.. మాది కాదంటూ...మౌనంగా కబ్జా అక్రమాలను చూసి చూడనట్లు వదిలేసిన రెవెన్యూ, ఒంగోలు కార్పొరేషన్ అధికారులకు తనదైన శైలిలో హితబోధ చేశారు. తక్షణం స్థలాల్లోని ఆక్రమణలను తొలగించి... చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని కలెక్టర్ వాడరేవు వినయ్ చంద్ ఆదేశించడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.

  ఒంగోలులో రూ.5 కోట్ల ప్రభుత్వ భూమి హాంఫట్.. పూర్తి కథనం..

  ఒంగోలు గోపాల్ నగర్ ఎక్సెటెన్షన్ చాకలి కుంటలో ఆక్రమణలో ఉన్న 2.70ఎకరాల భూమిలోని ఆక్రమణలను ప్రొక్లెయిన్లతో కూల్చివేశారు. ఈ సమయంలో ఆక్రమణ దారులు నగర కమిషనర్ శకుంతలతో వాగ్వాదానికి దిగారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల సహాయంతో అధికారులు ఆక్రమణ దారులను అదుపుచేసి.. కూల్చివేతలు కొనసాగించారు. దీంతో ప్రభుత్వానికి చెంది ఐదు కోట్ల రూపాయల విలువైన భూమిని కాపాడగలిగారు. ఈ కూల్చివేతల్లో మున్సిపల్‌ కమిషనరు కే.శకుంతలతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

  (డి.లక్ష్మీనారాయణ, ప్రకాశం జిల్లా కరస్పాండెంట్, న్యూస్‌18)
  First published:

  Tags: Andhra Pradesh, News18, Prakasham dist

  తదుపరి వార్తలు