శ్రీకృష్ణ పరమాత్ముని జననం ఓ అద్భుతం. అలాగే శ్రీకృష్ణుడి అల్లరి ఎంతో మురిపెంగా ఉంటుంది. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుని పాత్ర ఎంతో కీలకం. అటువంటి శ్రీకృష్ణ అవతార కీలక ఘట్టాలను చిత్రాలుగా మారిస్తే అది నిజంగా అద్భుతమే. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన చిత్రకారిణి చెరువు శ్రీలక్ష్మి కృష్ణం వందే జగద్గురుం అనే చిత్రంలో పొందుపరిచి అందరినీ అబ్బుర పరిచారు. ఈ చిత్రం ఎన్నో అవార్డులను సైతం దక్కించుకుంది.
ఒంగోలుకు చెందిన చెరువు శ్రీలక్ష్మి బాల్యం నుండే చిత్రకళపై మక్కువ పెంచుకున్నారు. శ్రీలక్ష్మి తండ్రి డాక్టర్ ధారా రామ నాధశాస్త్రి నాట్యావధాని కావడంతో..శ్రీలక్ష్మి చిత్రకళలో మరింత రాణిస్తూ పేరు గాంచారు. ఇదే సమయంలో తన తండ్రి సూచన మేరకు సృష్టి ఆర్ట్ అకాడమీ కార్యదర్శి రవీంద్ర శిక్షణలో చిత్రకళలో పట్టు సాధించి శ్రీకృష్ణుని అవతారాలను కీలక ఘట్టాలను ఒకే చిత్రంలో పొందుపరిచేందుకు ముందడుగు వేశారు. కృష్ణం వందే జగద్గురుం చిత్రంలో 72 దృశ్యాలు కృష్ణం వందే జగద్గురుం చిత్రంలో శ్రీకృష్ణుని జననం నుండి అవతార పరిసమాప్తి వరకు ఉన్న కీలక ఘట్టాలను 72 మీనియేచర్స్ తో శ్రీలక్ష్మి 3 నెలల పాటు శ్రమించి చిత్రాన్ని గీశారు. ఈ చిత్రాన్ని చూసిన స్వర్గీయ ప్రముఖ దర్శకులు విశ్వనాధ్ స్వయంగా ఒంగోలులోని శ్రీలక్ష్మి గృహానికి వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాక పలువురు ప్రముఖులు సైతం ఈ చిత్రాన్ని గీయడంపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ చిత్రానికి అవార్డుల పంట
కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికి ఎన్నో అవార్డులు దక్కాయని చిత్ర కారిణి శ్రీలక్ష్మి తెలిపారు. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, మిరాకిల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో అవార్డులు దక్కినట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, Local News, Prakasam