Graduate MLC Result: తూర్పు రాయలసీమ అంటే అధికార పార్టీకి కంచుకోటగా గుర్తింపు ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కనిపించింది. తూర్పు రాయలసీమ అంటే ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఉంటాయి.. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే.. నెల్లూరును వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.. ఇక చిత్తూరులో ఒకే ఒక్క సీటులో టీడీపీ నెగ్గింది. అది కూడా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం మాత్రమే.. మిగిలిన చోట్ల వైసీపీ హవా కనిపించింది. ఇక ప్రకాశం జిల్లాలోనూ టీడీపీ రెండు చోట్ల నెగ్గగా.. మిగిలినవన్నా వైసీపీ ఖాతాలోనే చేరాయి. అసెంబ్లీ ఎన్నకల తరువాత జరిగిన స్థానిక సంస్థలు.. ఇతర ఎన్నికల్లోనూ వైసీపీ జోరుకు తిరుగులేకుండా పోయింది. అలాంటి తూర్పు రాయలసీమ జిల్లాలో అధికార వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చారు గ్రాడ్యుయేట్స్. అసలు పోటీలోనే లేదు అనుకున్న ప్రతిపక్ష టీడీపీకి పట్టం కట్టారు. ఆ పార్టీ తరపున పోటీ చేసిన కంచర్ల శ్రీకాంత్ ఘన విజయం సాధించారు.
రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి శ్రీకాంత్ 1,12,686 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్‌రెడ్డికి 85,423 ఓట్లు పోలయ్యాయి.34,110 ఓట్ల ఆధిక్యం తో ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. ఆయన గెలుపుకి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఆయకు అడ్వాంటేజ్ అయ్యింది. దానికి తోడు ఆయన వ్యక్తిగత ఇమేజ్ కలిసి వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చీలకుండా.. రెండో ప్రధాన్య ఓట్లలో ఎక్కువ ఆయకే పడడం విజయంలో కీలక పాత్రగా మారింది.
ఆయన నేపథ్యం ఇదే..
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలిచిన కంచర్ల శ్రీకాంత్ సొంత ఊరు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం అత్తంటివారిపాలెం. ఆయన బీటెక్, ఎంబీఏ, ఎంఐఈ చేశారు.. 2018లో డాక్టరేట్ వచ్చింది. కందుకూరులోని ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీ ట్రెజరర్‌గా ఉన్నారు. 2009 నుంచి టీడీపీలో బాగా యాక్టివ్ అయ్యారు. 2014లో కందుకూరు నుంచి టీడీపీ జడ్పీటీసీ సభ్యునిగా పోటీచేసి విజయం సాధించారు. ఉత్తమ జడ్పీటీసీ సభ్యునిగా 2017లో అవార్డు అందుకున్నారు.
రాజకీయ రంగ ప్రవేశం:
ఃకంచర్ల శ్రీకాంత్ చౌదరి 2008లో రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ లో చేరారు. 2008 లోతెలుగు సాంకేతిక నిపుణుల విభాగం ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉంటూ, 2009 అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి స్టార్ క్యాంపెయినింగ్ కమిటీ సభ్యుడిగా సైతం పనిచేశారు. అనంతరం 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కందుకూరు మండలం నుండి టిడిపి మద్దతుతో జడ్పిటిసి సభ్యునిగా పోటీ చేసి 1848 ఓట్ల మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు. కాగా టిడిపి ఆవిర్భావం అనంతరం కందుకూరులో తొలిసారిగా టిడిపి విజయం సాధించడం అది రెండవసారి. 2017, 2018లో రాష్ట్రస్థాయి ఉత్తమ జడ్పిటిసి పురస్కారాన్ని అప్పటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్నారు.
అంతేకాదు పలు సేవా కార్యక్రమాలు కూడా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. శ్రీకాంత్ పేద విద్యార్థులకు ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వ కళాశాలల్లో చదువుల్లో రాణిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తూ వస్తున్నారు. 2021లో ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పదవి దక్కింది.
డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కంచర్ల ఫౌండేషన్ ను రాజకీయ రంగ ప్రవేశం లోని స్థాపించి వరద బాధితులకు సేవలు అందించడంతోపాటు, ఇప్పటికీ రక్తదాన, మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఉన్నారు. టిసిఎస్-ఏఎల్పి అనే కేంద్రాన్ని కందుకూరులో స్థాపించి నిరక్షరాస్యులైన వయోజనులకు విద్యను అందించే కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, TDP