హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Cyclone Mandous: మండూస్ పై సీఎం జగన్ అలర్ట్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

Cyclone Mandous: మండూస్ పై సీఎం జగన్ అలర్ట్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

ఏపీపై మాండూస్ ఎఫెక్ట్

ఏపీపై మాండూస్ ఎఫెక్ట్

Cyclone Mandous: ఏపీని మరో ముప్పు భయపెడుతోంది. తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. జిల్లాల కలెక్టర్లకు కీలక సూచలు చేశారు.. పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. ఆయా ప్రాంతాల ప్రజలను ముందే అప్రమత్తం చేయాలన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Cyclone Mandous: ఆంధ్రప్రదేశ్ (Andha Pradesh) కు మాండూస్ గండం పొంచిఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం అర్థరాత్రి దాటాక తుఫాన్ (Cyclone) గా మారింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపుగా  దూసుకొస్తున్న తుఫాను.. రేపు తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) అలర్ట్ అయ్యారు. ఆ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. అధికారులతో సమీక్ష చేశారు జగన్.. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని.. పంటలకు నష్టం వాటిళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.. అలాగే ముంపు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా అలర్ట్ చేయాలని.. టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలన్నారు.. ప్రస్తుతం తుఫాను దూకుడు చూ్తుంటే.. రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ప్రస్తుతం తుఫాను చెన్నైకి ఆగ్నేయంగా 640 కి.మీ దూరంలో ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర జిల్లాల్లో, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను మధ్య శుక్రవారం రాత్రి సమయంలో గంటలకు 67-75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దూసుకొస్తున్న తుఫాన్ కారణంగా శనివారం వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని కొన్ని చోట్ల, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ మాండూస్‌ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ముఖ్యంగా ప్రకాశం , నెల్లూరు , తిరుపతి , చిత్తూరు , అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి 10, 11 తేదీల్లో ఏపీలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ఇదీ చదవండి : వ్యూహం మార్చిన వైసీపీ .. ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్న ఎంపీలు.. లిస్ట్ ఇదే

ఈనెల 11వ తేదీ వరకు మాండౌస్ తుపాను ఎఫెక్ట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో సీఎం జగన్ ఆదేశాల మేరకు.. సహాయక చర్యలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ వై హరినారాయణన్ అన్ని శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. సచివాలయాల సిబ్బంది వాగులు, వంకలు, చెరువుల వద్ద నీటి ప్రవాహ వేగాన్ని ఎప్పటికప్పుడు అంచనావేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Cyclone alert, Heavy Rains

ఉత్తమ కథలు