ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)ప్రకాశం (Prakasam) జిల్లాలో ఏడాదిన్నర క్రితం ఓ చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మానవమృగం ఏడేళ్ల బాలికపై తండ్రి వరసయ్యే వ్యక్తి అత్యాచారానికి పాల్పడి ఆమె చావుకు కారణమయ్యాడు. దారుణానికి పాల్పడిన నిందితుడికి కోర్టు ఉరిశిక్ష(Hanging)విధించింది. అంతే కాదు చిన్నారి తల్లిదండ్రులకు 10లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏడాదిన్నర క్రితం సంచలనం సృష్టించిన కేసులో కోర్టు (Court)న్యాయమైన తీర్పు వెల్లడించడంతో మృతురాలి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
దోషికి ఉరిశిక్ష..
18నెలల క్రితం ప్రకాశం జిల్లాలో మైనర్ బాలిక అత్యాచారం, హత్య కేసులో ఒంగోలు రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నేరం చేసిన నిందితుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. జిల్లాలోని గిద్దలూరు మండలం అంబవారం గ్రామానికి చెందిన దూకేకుల సిద్దయ్య అనే వ్యక్తి 2021జులై నెలలో ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారిక మాటమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. గట్టిగా కేకలు వేయడంతో తాళ్లతో కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన సమయంలో చిన్నారి ప్రాణాలు విడిచింది. వెంటనే చిన్నారి మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి గ్రామ శివార్లలోని చెత్తకుప్పలో పడేసి పారిపోయాడు నిందితుడు.
10లక్షల పరిహారం....
తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని పట్టుకొని అతనిపై హత్య, అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారు. కేసు విచారణలో భాగంగా బుధవారం నిందితుడిని దోషిగా నిర్థారించింది కోర్టు. దారుణానికి పాల్పడిన నిందితుడికి మరణశిక్ష (ఉరివేయాలని) విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈకేసులో మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం 10లక్షల రూపాయల పరిహారం అందజేయాలని సూచింది.
పోలీస్ సిబ్బందికి ప్రశంసలు..
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈకేసులో నిందితుడ్ని పట్టుకోవడం, అతని శిక్ష పడటంలో ప్రతిభ కనబర్చిన నాటి దిశ స్టేషన్ డీఎస్పీతో పాటు పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ రివార్డులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Crime news, Ongole