హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం కరెంట్ షాక్.. మళ్లీ ఏపీలో పవర్ కట్‌లేనా..? అసలు విషయం అదేనంటున్న ఆంధ్రా అధికారులు..!

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం కరెంట్ షాక్.. మళ్లీ ఏపీలో పవర్ కట్‌లేనా..? అసలు విషయం అదేనంటున్న ఆంధ్రా అధికారులు..!

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం బిగ్ షాక్

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం బిగ్ షాక్

కేంద్రం గురువారం అర్ధరాత్రి నుంచి సంచలన నిషేధం అమలులోకి తెచ్చింది. ఇరు తెలుగు రాష్ట్రాల (Telugu States)తో పాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు చెందిన 29 విద్యుత్ పంపిణీ సంస్థ (Discoums)లకు రోజువారీ కరెంట్ కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం (Central Government) నిషేధం విధించింది. దీని అర్థం దేశవ్యాప్తంగా విద్యుత్ క్రయ విక్రయాలు జరిగే ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజీ (IEX) నుంచి ఇకపై ఎలాంటి లావాదేవీలు జరగకూడదనమాట. దేశంలోని 13 రాష్ట్రాలు విద్యుత్ బిల్లులను గడువులోగా చెల్లించకపోవడమే ఇందుకు కారణం.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Andhra Pradesh, India

  కేంద్రం గురువారం అర్ధరాత్రి నుంచి సంచలన నిషేధం అమలులోకి తెచ్చింది. ఇరు తెలుగు రాష్ట్రాల (Telugu States)తో పాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు చెందిన 29 విద్యుత్ పంపిణీ సంస్థ (Discoums)లకు రోజువారీ కరెంట్ కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం (Central Government) నిషేధం విధించింది. దీని అర్థం దేశవ్యాప్తంగా విద్యుత్ క్రయ విక్రయాలు జరిగే ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజీ (IEX) నుంచి ఇకపై ఎలాంటి లావాదేవీలు జరగకూడదనమాట. దేశంలోని 13 రాష్ట్రాలు విద్యుత్ బిల్లులను గడువులోగా చెల్లించకపోవడమే ఇందుకు కారణం.

  విద్యుత్ లభ్యతకు మించి డిమాండ్ ఉన్న రాష్ట్రాలు ఆ లోటును పూడ్చుకోవడానికి ఎనర్జీ ఎక్స్ఛేంజీ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుంటాయి. అలాగే విద్యుత్ డిమాండ్ తగ్గి, మిగిలిపోయినప్పుడు దానిని ఎనర్జీ ఎక్స్ఛేంజీలో విక్రయిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆయా రాష్ట్రాలు విద్యుత్ కొనుగోల, అమ్మకాల అవకాశాన్ని కోల్పోనున్నాయి.

  ఇదీ చదవండి:  ఏపీలో రసవత్తర రాజకీయం.. జనసేన పొత్తు ఆ పార్టీతోనే.. క్లారిటీ వచ్చేసింది..?

  కేంద్ర ప్రభుత్వం గత జూన్‌లో అమలులోకి తెచ్చిన లేట్ పేమెంట్ సర్చార్ఝీ రూల్స్-2022 ప్రకారం.. విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కొనుగోలు చేసిన కరెంట్‌కు సంబంధించిన బిల్లులను 45 రోజుల గడువులోగా డిస్కంలు చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే సదరు డిస్కంలకు విద్యుత్ విక్రయించకుండా ఆపేస్తారు. ఈ క్రమంలో 13 రాష్ట్రాలు విద్యుత్ క్రయ, విక్రయాలు చేయకుండా నిషేధించారు. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ శాఖ పరిధిలోని పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ (పొసోకో) ఆయా రాష్ట్రాలకు వర్తమానం పంపింది.

  అయితే, కేంద్రం విడుదల చేసిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ పేరు ఉండటంపై ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పందిస్తూ వివరణ ఇచ్చారు. పవర్ ఎక్స్ఛేంజీల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్‌కు ఏపీ ప్రభుత్వం ఎలాంటి బకాయిలూ లేదని ఆయన స్పష్టం చేశారు. సమాచార లోపం వల్లే విద్యుత్ క్రయ విక్రయాల నిషేధిత జాబితాలో ఏపీని చేర్చారని ఆయన చెప్పారు. విద్యుత్ క్రయవిక్రయాల విషయంలో కేంద్రం విధించిన నిషేధం ఏపీకి వర్తించదని పేర్కొన్నారు. ఏపీ డిస్కంలు చెల్లించాల్సిన రూ.350 కోట్లు ఇప్పటికే చెల్లించేశాయని.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్లడంతో ఆ జాబితా నుంచి ఏపీ పేరు తొలగించినట్లు కె.విజయానంద్ స్పష్టం చేశారు.

  మరోవైపు ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం కావాలనే కక్షపూరిత ధోరణిలో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు స్పందిస్తూ.. రాష్ట్ర విద్యుత్ సంస్థలను కేంద్రం ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. హైకోర్టు స్టే ఉన్నా ఐఈఎక్స్ లావాదేవీలపై నిషేధం విధించడం సరికాదన్నారు. దీనిపై సోమవారం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని ఆయన చెప్పారు.

  First published:

  Tags: Andhra Pradesh, Power Charges, Power problems, Telangana

  ఉత్తమ కథలు