POWER CUTS IN OVERALL INDIA MORE THAN 12 STATES BECAUSE OF COAL SHORTAGE NGS
Power Crisis: దేశ వ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న విద్యుత్ కోతలు.. అలర్ట్ అయిన కేంద్రం
ఏపీలో విద్యుత్ సమస్యలు ఎప్పటి వరకు అంటే?
Power Crisis: ఓ వైపు దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మేలో మరింత మాడు పగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల 40కి పైగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో విద్యుత్ కోతలు నరకాన్ని చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొంది. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది.
Power Crisis: దేశ వ్యాప్తంగా ఎండలు చంపేస్తున్నాయి. దాదాపు చాలా ప్రాంతాల్లో 40 శాతానికిపైగా ఉష్ణోగ్రతలు భయపెడుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటితే.. బయటకు వెళ్లాలి అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తుంటే (Sun Stroke).. కరెంట్ కోతలు (Power Cuts) ప్రజలకు ప్రత్యక్ష నరకం కనబడుతోంది. అయితే ఓవైపు ఎండలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు పలు రాష్ట్రాల్లో అప్రకటిత కరెంట్ కోతలు నరకాన్ని చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొంది. బొగ్గుకొరతను నివారించడానికి కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. బొగ్గు కొరత (Coal Storage) కారణంగా తీవ్ర కరెంట్ సంక్షోభం తప్పడం లేదు. అంతేకాదు దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుతున్న ఎండల కారణంగా దేశవ్యాప్తంగా కరెంట్ డిమాండ్ రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతూ వస్తోంది. యూపీ (UP), రాజస్థాన్ (Rajasthan), మధ్యప్రదేశ్ (Madhaypradesh), పంజాబ్ (Punjab), హర్యానా (Haryana), ఉత్తరాఖండ్ (Uttarakhand), బీహార్ (Bihar), జార్ఖండ్ (Jarkhand), మహారాష్ట్ర (Maharastra), గుజరాత్ (Gujarat) , కర్నాటక (Karnataka) , ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులు పడక తప్పడం లేదు..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరెంట్ కోతలను అధిగమించే చర్యల్లో భాగంగా 657 ప్యాసింజర్ రైళ్లను నిరవధికంగా రద్దు చేసింది కేంద్రం. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును పవర్ ప్లాంట్లకు తరలించే క్రమంలో-బొగ్గు సరఫరా చేస్తున్న 400 రైల్ రేక్స్ ప్రయాణానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశంలో 165 థర్మల్ పవర్ స్టేషన్లు ఉంటే, వాటిలో 56 పవర్ స్టేషన్లలో 10 శాతం, అంతకన్నా తక్కువ బొగ్గు నిల్వ ఉందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చెబుతోంది. కనీసం 26 థర్మల్ స్టేషన్లలో 5 శాతం బొగ్గు నిల్వ ఉందని ఈ సంస్థ చెప్పడంతో డేంజర్‌బెల్స్ మోగుతున్నాయి.
మరోవైపు విద్యు్ డిమాండ్ కారణంగా 38 ఏళ్లలో కనీవినీ ఎరుగని రికార్డుస్థాయికి చేరింది. దేశవ్యాప్తంగా ఎండలు 122 ఏళ్లలో అత్యంత తీవ్రంగా ఉండటమే కారణం. కరెంట్ డిమాండ్‌కు సరిపడా సప్లయ్ లేకపోవడమే ఈ విద్యుత్ కోతలకు కారణం. మండే ఎండల్లో కరెంటు ఉత్పత్తి చేయడానికి సరిపడా బొగ్గు నిల్వలు మనదేశంలో లేవు. గుజరాత్‌లో పరిశ్రమలు వారానికి ఒకరోజు పవర్ హాలీడే ప్రకటించాయి. మహారాష్ట్రలో ఆరు నుంచి ఎనిమిది గంటలు పవర్ కట్ చేస్తున్నారు. ఇదే సమయంలో కరెంట్ కోతలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. పంజాబ్‌లోని భటిండాలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. కరెంటు, నీళ్లు ఇవ్వాలని కేంద్రాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అటు జమ్ములో కూడా ఇవే డిమాండ్లతో కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కాయి. కేంద్రంపై బాణాలు ఎక్కుపెడుతూ మండుటెండలో ప్రదర్శన చేపట్టారు.
ఇటు విద్యుత్ సంక్షోభంపై ఢిల్లీలో పాలిటిక్స్ ఊపందుకున్నాయి. ఢిల్లీలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడనుందని ఆప్ ప్రభుత్వం హెచ్చరించింది. ఢిల్లీ మెట్రోతో పాటు హాస్పిటళ్లకు కూడా విద్యుత్తు సరఫరాలో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. దాద్రి-2, ఉంచాహర్ విద్యుత్తు కేంద్రాల నుంచి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని, ఢిల్లీ మెట్రోతో పాటు ప్రభుత్వ హాస్పిటళ్లు, ఇతర కీలక కార్యాలయాలకు 24 గంటల విద్యుత్తును సరఫరా చేయడం సాధ్యం కాదని వెల్లడించింది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.