POSANI KRISHNA MURALI PRAYED GOD FOR JAGAN MOHAN REDDY VICTORY FULFILLED HIS WISHES AFTER ELECTION RESULTS CR
జగన్ సీఎం కావాలనేది నా చివరి కోరిక... అప్పుడు బాబుకు సపోర్ట్ చేశా... - పోసాని కృష్ణమురళి...
పోసాని, వైఎస్ జగన్
మొదటి నుంచి జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేది... అనుభవుజ్ఞుడైన ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే గతంలో చంద్రబాబుకు మద్ధతు ఇచ్చా... హైదరాబాద్‌లో ఆలయాల్లో మొక్కలు సమర్పించుకున్న పోసాని కృష్ణమురళి...
నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడినా... అది సంచలనమే. ఏ మాత్రం మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా, తన మనసులో మాట బయటపెట్టే పోసాని కృష్ణమురళి... ఈ ఎన్నికల ముందు వైఎస్ఆర్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. బేసిగ్గా పోసాని కృష్ణమురళి మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉంటాడనే టాక్ ఉంది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీని, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ, మెగా ఫ్యామిలీపై కూడా విరుచుకుపడ్డాడు. ఆయన కోరుకున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన ‘గ్లాసు’ కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటుకే పరిమితం కాగా... జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేసిన రెండు చోట్లా ఘోరంగా ఓడిపోయాడు. వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ సీపీ 151 సీట్లు కైవసం చేసుకుని చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో తన మొక్కులను తీర్చుకున్నాడు వైఎస్ జగన్. వైసీసీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని దేవుడికి మొక్కుకున్నానని చెప్పిన పోసాని కృష్ణమురళి... ఆ కోరిక నేరవేర్చినందుకు వస్త్రాలు సమర్పించి, మొక్కులు తీర్చుకుంటున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట, బేగంపేట, ఫిలింనగర్‌లోని ఆలయాల్లో దేవుళ్లకు వస్త్రాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నాడు పోసాని కృష్ణమురళి.
ఈ తెలంగాణలో ఫలితాలు సరైనవేనని వ్యాఖ్యానించారు పోసాని కృష్ణ మురళి...
‘తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని గతంలో దేవుడిని మొక్కుకున్నా. ఆ కోరిక తీరగానే మొక్కులు సమర్పించా. వైఎస్ జగన్ ఆంధ్రా సీఎం కావాలనేది నా చివరి కోరిక. ఈ ఎన్నికల్లో ఆ కోరిక నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి పైకొచ్చాను నేను. ప్రస్తుతం మంచి కుటుంబంతో సంతోషంగా ఉన్నాను. ప్రజల తీర్పు చూసిన తర్వాత చంద్రబాబులో మార్పు రావడం కూడా ఎంతో సంతోషాన్నిచ్చింది. జగన్ జనరంజక పాలనతో మంచి పేరు తెచ్చుకుని, మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా...’ అంటూ మీడియాకు తెలిపారు పోసాని కృష్ణమురళి. జగన్‌కే ఎందుకు మద్ధతు అనే ప్రశ్నకు కూడా పోసాని కృష్ణమురళి.. సమాధానం ఇచ్చారు. ‘వైఎస్ జగన్ మంచి వ్యక్తి. మంచి మనసున్న వ్యక్తి కాబట్టే ఆయనకు నిస్వార్థంగా మద్ధతు ఇచ్చా... ఆయనకంటే మరో సమర్థుడు వస్తే అతనికీ మద్ధతిస్తా..’ అంటూ తెలిపారు పోసాని.
ఆంధ్రా ప్రజలు నమ్మి, నాయకత్వం అప్పగిస్తే చంద్రబాబు నాయుడు, వారి నమ్మకాన్ని వొమ్ముచేశారని వ్యాఖ్యానించారు పోసాని.
ఇంతకుముందు ఎన్నికల్లో పోసాని, నారా చంద్రబాబుకు మద్ధతు ఇచ్చారు. దీనిపై కూడా ఆయన మాట్లాడారు. ‘గతంలో ఈ రాష్ట్రానికి అనుభవుజ్ఞుడైన ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో చంద్రబాబుకు మద్ధతిచ్చా... తర్వాత ఆయన పాలన నచ్చకే విమర్శించా. బాబుకు సపోర్ట్ చేయడం వల్లే పవన్ కల్యాణ్‌కు ఘోర ఓటమి ఎదురైంది. మొదటి నుంచి జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసి, పోరాడి ఉంటే ప్రజల మద్ధతు దక్కేది... ’ అని వ్యాఖ్యానించారు పోసాని కృష్ణమురళి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.