Posani - Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన పోసాని.. ఆ హీరోయిన్‌కు న్యాయం చేయండి అంటూ..

పవన్ కళ్యాణ్, పోసాని కృష్ణమురళి (File/Photo)

Posani Krishna Murali  - Pawan Kalyan : పవర్ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్  ప్రీ రిలీజ్ వేడుకలో ఏపీలోని వైసీపీ ప్రభుత్వ తీరును తనదైన శైలిలో విమర్శించిన సంగతి తెలిసిందే కదా. దీనికి కౌంటర్‌గా పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో పవన్ కళ్యాణ్‌కు సమాధానమిచ్చారు.

 • Share this:
  Posani Krishna Murali  - Pawan Kalyan : పవర్ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్  ప్రీ రిలీజ్ వేడుకలో ఏపీలోని వైసీపీ ప్రభుత్వ తీరును తనదైన శైలిలో విమర్శించారు. టిక్కెట్స్‌ను ఆన్‌లైన్‌లో అమ్మాలనుకుంటున్న తీరును తూర్పారా పట్టారు. అంతేకాదు సినీ నటులు కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ప్రభాస్, రానా వంటి వారు కండలు పెంచితేనే డబ్బులు ఇస్తారు. ఎన్టీఆర్ డాన్సులు చేస్తే .. రామ్  చరణ్ గుర్రపు స్వారీ వంటి సాహసాలు చేస్తేనే మాకు డబ్బులు వస్తాయి. కాంట్రాక్ట్‌లతో మాకు తేరగా డబ్బులు రావడం లేదంటూ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్‌తో పాటు ఆ పార్టీ మంత్రులపై తనదైన శైలిలో విరుచుకు పడిని సంగతి తెలిసిందే కదా.

  పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రభుత్వ తీరును తిట్టడంపై ఆ పార్టీనేత సినీ నటుడు, దర్శకుడు, రచయత పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో స్పందించారు. పవన్ కళ్యాణ్‌కు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదన్నారు. ఏపీ సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్‌కు పోలికే లేదన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కుల పిచ్చి ఎక్కువని పవన్ కళ్యాణ్ ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.

  Tamil Heroes In Telugu : విజయ్ సహా తెలుగు సినిమాల్లో డైరెక్ట్ ఎటాక్ చేసిన తమిళ హీరోలు ఇంకెవరున్నారంటే..

  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చేసిన అప్పులను, దళితులను అవమానించిన ఘటనల గురించి ఎందుకు ప్రస్తావించలేదన్నారు. అంతేకాదు నాయి బ్రహ్మాణుల తోకలు కట్ చేస్తా అన్నపుడు ఎక్కడ ఉన్నావని ప్రశ్నించారు.అంతేకాదు బాబు హయాంలో ముద్రగడ కుటుంబాన్ని బజారుకు లాగారు. నాకు కులం లేదన్న పవన్ కళ్యాణ్.. అందరి గురించి కాకుండా కాపుల గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారన్నారు.

  Venkatesh : ఆర్తి అగర్వాల్ సహా వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన భామలు వీళ్లే..

  ఇక చిరంజీవితో తనకు రాజకీయ విభేదాలున్నా.. ఎపుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. సినీ పరిశ్రమలో ఛాన్సుల పేరుతో ఓ పంజాబీ అమ్మాయిని ఓ పెద్దాయన మోసం చేస్తే బాధితురాలికి న్యాయం చేయడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. ఆ అమ్మాయికి న్యాయం చేస్తే పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టిస్తానన్నారు.  ఏపీ సీఎం తన నియోజకవర్గానికి రాకపోయినా.. ఆయన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకొని మళ్లీ  గెలిపిస్తారన్నారు. కానీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. ఒక్క చోట కూడా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు.

  Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

  పవన్ కళ్యాణ్ తనే ప్రశ్నిస్తాడు. తనే సమాధానం చెబుతాడు అన్నారు. ఆయనకు ఏ విషయంలో క్లారిటీ లేదన్నారు. నీకు ఏ అర్హతలు ఉన్నాయని జగన్‌కు తిడుతున్నావు. ఆన్‌లైన్‌లో టిక్కెట్స్ అమ్మితే నీకేంటి సంబంధ అన్నారు.   పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తున్నందకు చిత్ర పరిశ్రమ తనను బ్యాన్ చేసినా.. తనకు బాధ లేదంటూ పోసాని కృష్ణమురళి కుండబద్దలు కొట్టారు.

  ఇక పోసాని వ్యాఖ్యాలకు పవన్ కళ్యాణ్.. ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. తమ్మెదా ఝంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమే కదా రాసుకొచ్చారు. ‘హు లెట్ దిగ డాగ్స్ ఔట్’ అనే పాటను షేర్ చేస్తూ నాకు ఇష్టమైన పాట అంటూ కాస్తా ఘాటుగానే బదులిచ్చారు.

  Chiranjeevi Remakes: లూసీఫర్ కాకుండా చిరంజీవి తన కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..


  పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. ఈయన ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ సినిమా చేస్తున్నారు. దాంతో పాటు హరి హరవీరమల్లు సినిమాల్లో నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవధీయుడు భగత్‌సింగ్’ సినిమా చేస్తున్నారు. దాంతో పాటు  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ సినిమాకు ఓకే చేసిన సంగతి తెలిసిందే కదా.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: