జూనియర్ ఎన్టీఆరే కాబోయే సీఎం...పోసాని సంచలన వ్యాఖ్యలు...

(ఫైల్ చిత్రం)

ప్రజల్లో నమ్మకం ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని అన్నాడు. లేకపోతే చంద్రబాబు లాగా మోసం చేసే తెలివితేటలైనా ఉండాలని పోసాని అన్నారు.

  • Share this:
    నటుడు, రచయిత, రాజకీయ విశ్లేషకుడు పోసాని కృష్ణ మురళి తరచూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలో చెబుతూ తనదైన మార్కు సలహాలు ఇచ్చాడు. అందులో ముఖ్యమైన పాయింటు ఏంటంటే...ప్రజల్లో నమ్మకం ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని అన్నాడు. లేకపోతే చంద్రబాబు లాగా మోసం చేసే తెలివితేటలైనా ఉండాలని పోసాని అన్నారు. అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్ తన విల్ పవర్ తో సీఎం కాగలిగారని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ సైతం నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ ఉంటే కచ్చితంగా సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలకు నమ్మకం ఉంటే ఎలాంటి వారైనా సీఎం అయ్యే అవకాశం ఉందని పోసాని అన్నారు.
    Published by:Krishna Adithya
    First published: