TTD : దేవ దేవా..!! యస్వీబిసి లో పోర్న్ సైట్ లింక్ కలకలం..

ప్రతీకాత్మక చిత్రం

ఆ ఛానెల్ లో దేవదేవుడికి సంబంధించిన విషయాలు వస్తాయి. ఆయన ముగ్ద మనోహర రూపాన్నిచూసి భక్తులు పులకించిపోతారు. స్వయంగా ఆ పుణ్యక్షేత్రానికి వెళ్లలేని భక్త జన కోటి కోసం ఏర్పాటు చేసిన ఆ ఛానెల్ ఈ మధ్య తాను చేస్తున్న పనులతో అపకీర్తి మూటగట్టుకుంటున్నది.

  • News18
  • Last Updated :
  • Share this:
    అది దేవదేవుడు కొలువై ఉన్న నేల. అక్కడ జరిగే విషయాలను, ఆ భగవంతుడిని ప్రత్యక్షంగా చూడలేని వారికి.. ఆయన మనోహరమైన రూపాన్ని ప్రజలకు చూపించే ఛానెల్. ఆ దివ్య క్షేత్రానికి వెళ్లలేనివారు.. వెళ్లడానికి వీలు లేనివాళ్లకు ఆ ఛానెల్ ఒక ఆధ్యాత్మిక మందిరం వంటిది. స్వామివారికి జరుగుతున్న సేవలు, అక్కడి వస్తున్న భక్తులు, ప్రదర్శనలు, పాటలు, ఆధ్యాత్మిక గురువులతో నిత్యం జనరంజకంగా ఉండే కార్యక్రమాలను ప్రసారం చేయాలని.. వాటిని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఛానెల్.. రాను రాను దాని పవిత్రతను కోల్పోతున్నది. కొద్దికాలంగా ఆ ఛానెల్ వ్యవహారాలు జనాలలో దానికున్న కీర్తిని సర్వం నాశనం చేస్తున్నాయి.

    గతంలోనూ ఆ ఛానెల్ నిర్వహిస్తున్న ఓ అధికారి రాసలీలల వీడియో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దేవదేవుడి సంకీర్తనలు ప్రసారం కావల్సిన ఆ ఛానెల్ లో పోర్న్ లింక్ లు దర్శనమిచ్చాయి. ఇది చూసిన భక్త జన కోటి ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఇది ఎక్కడో జరిగింది కాదు. ఆ ఘనత వహించింది మన యస్విబిసినే.

    యస్వీబీసీలో శతమానం భవతి కార్యక్రమానికి సంభిందించి ఆ ఛానెల్ కు ఒక భక్తుడు మెయిల్ చేశాడు. తిరిగి ఆ భక్తుడికి పోర్న్ సైట్ వీడియో పంపాడో యస్వీబిసి ఉద్యోగి.ఇది చూసి సదరు భక్తుడు యస్వీబిసి టిటిడి చైర్మన్, ఇఓకి పిర్యాదు చేశాడు. ఘటన పై తీవ్రంగా స్పందించిన చైర్మైన్ వైవి సుబ్బారెడ్డి, ఇఓ జవహర్ రెడ్డి.. యస్వీబిసి కార్యలయంలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

    దీంతో టిటిడి విజిలెన్స్, సైబర్ క్రైమ్ టీం, ఈడిపి అధికార్లు.. పోర్న్ సైట్ విడియో పంపిన ఉద్యోగితో పాటు కార్యాలయంలో పోర్న్ సైట్లు చూస్తూన్న మరో 5 గురు ఉద్యోగులును గుర్తించింది. కార్యలయంలో విధులు నిర్వహించకూండా ఇతర వీడియోలు చూస్తూన్న మరో 25 మంది సిబ్బందిని కూడా వారు గుర్తించారు. బాధ్యతలు మరిచి.. అతి పవిత్రమైన చోట ప్రవర్తించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు యస్వీబిసి యంత్రాంగం సిద్దమవుతున్నట్టు సమాచారం.
    Published by:Srinivas Munigala
    First published: