అమరావతి రైతులకు ప్రముఖ సింగర్ మద్దతు..

అమరావతి నుంచి రాజధాని తరలింపును నిరసిస్తూ రైతులు చేపట్టిన నిరసనలకు ప్రముఖ సింగర్ స్మిత కూడా తన మద్దతు తెలిపింది. రాజధాని తరలింపు బాధాకరమని, రైతుల వేదన చూస్తుంటే గుండె ముక్కలవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

news18-telugu
Updated: January 10, 2020, 7:01 AM IST
అమరావతి రైతులకు ప్రముఖ సింగర్ మద్దతు..
అమరావతి, స్మిత
  • Share this:
అమరావతి నుంచి రాజధాని తరలింపును నిరసిస్తూ రైతులు చేపట్టిన ధర్నాలు, నిరసనలకు సినీ హీరో నారా రోహిత్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా, వారికి ప్రముఖ సింగర్ స్మిత కూడా తన మద్దతు తెలిపింది. రాజధాని తరలింపు బాధాకరమని, రైతుల వేదన చూస్తుంటే గుండె ముక్కలవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రైతులపై సానుభూతి చూపించలేని వాళ్లను చూస్తుంటే కూడా బాధ కలుగుతోందని, రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. వారికి న్యాయం జరగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని చెప్పింది. రైతులకు అండగా తాను ఉన్నానని స్మిత స్పష్టం చేసింది.
సింగర్ స్మితFirst published: January 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు