హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

elections : పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం -ఏపీలో పెండింగ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు -అదే టెన్షన్

elections : పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం -ఏపీలో పెండింగ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు -అదే టెన్షన్

ఏపీలో స్థానిక ఎన్నికల పోలింగ్

ఏపీలో స్థానిక ఎన్నికల పోలింగ్

టెన్షన్ మధ్యే మున్సిపల్ ఎన్నికలు ముగియగా.. మంగళవారం నాడు పెండింగ్ పరిషత్ పోరు ఆరంభమైంది. వివిధ కారణాల వల్ల ఆగిపోయిన లేదా విజేతలు చనిపోయిన కారణంగా ఏపీలో 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది..

ఇంకా చదవండి ...

అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య తీవ్ర స్థాయి మాటల యుద్ధం, పలు చోట్ల ఉద్రిక్తతలు, దొంగ ఓట్ల కలకలం, వీడియోలతో పరస్పర విమర్శలు.. తదితర ఘటనలతో టెన్షన్ మధ్యే మున్సిపల్ ఎన్నికలు ముగియగా.. మంగళవారం నాడు పెండింగ్ పరిషత్ పోరు ఆరంభమైంది. వివిధ కారణాల వల్ల ఆగిపోయిన లేదా విజేతలు చనిపోయిన కారణంగా ఏపీలో 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది..

ఏపీలో పరిషత్ ఎన్నికలు నెలల కిందటే జరగ్గా, అప్పుడు వివిధ కారణాలతో ఆగిపోయిన, గెలిచినవారు చనిపోయిన కారణంగా ఆయా స్థానాల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవికాకుండా గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన కడప జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోను మంగళవారం ఫ్రెష్‌ (రీ) పోల్‌ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు చెప్పారు.

మొత్తం 14 జెడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేయగా, వీటిలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, 50 ఎంపీటీసీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఎవరూ నామినేషన్ల దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలినచోట్ల 954 పోలింగ్‌ కేంద్రాల్లో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతున్నది. జెడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 8,07,640 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఓట్లను ఈనెల 18న లెక్కిస్తారు.

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సోమవారం నాడు అధికార, విపక్షాల మధ్య పలు ఊళ్లలో టెన్షన్ చెలరేగిన దరిమిలా ఇవాళ్టి పరిషత్ ఎన్నికలకూ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికలు జరిగే ప్రాంతాలకు అధికార పార్టీ స్థానికేతరులను తరలించి, వారితో ఓట్లు వేయించేందుకు ప్రయత్నించిందని టీడీపీ ఆరోపించింది. వైసీపీ మాత్రం వాటిని ఖండిస్తూ తప్పులన్నీ టీడీపీనే చేసిందని విమర్శించింది.

First published:

Tags: Ap local body elections, AP News

ఉత్తమ కథలు