Home /News /andhra-pradesh /

kuppam : ఏక్షణమైనా వచ్చేస్తా -ఉద్రిక్తతపై చంద్రబాబు ఫైర్ -మున్సిపల్ ఎన్నికల పోలింగ్ -ఇవీ తాజా అప్‌డేట్స్

kuppam : ఏక్షణమైనా వచ్చేస్తా -ఉద్రిక్తతపై చంద్రబాబు ఫైర్ -మున్సిపల్ ఎన్నికల పోలింగ్ -ఇవీ తాజా అప్‌డేట్స్

మున్సిపల్ పోలింగ్ వేళ కుప్పంలో ఉద్రిక్తత

మున్సిపల్ పోలింగ్ వేళ కుప్పంలో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సోమవారం కొనసాగుతున్నది. నెల్లూరు కార్పొరేషన్ తోపాటు వివిధ జిల్లాల్లోని 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా, చంద్రబాబు ఇలాకా కుప్పంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుప్పంలో టీడీపీ నేతలు, కార్యకర్తల అరెస్టులపై చంద్రబాబు ఫైరయ్యారు. ఏ క్షణమైనా కుప్పానికి వస్తానని తమ్ముళ్లకు భరోసా ఇచ్చారు. వివరాలివి..

ఇంకా చదవండి ...
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం నుంచి సజావుగా సాగుతున్నది. నెల్లూరు కార్పొరేషన్ తోపాటు వివిధ జిల్లాల్లోని 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా, సోమవారం నాటి పోలింగ్ కు ఈసీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచి పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్ల సందడి కనిపించిది. మిగతా చోట్ల పరిస్థితి దాదాపు ప్రశాంతంగా ఉండగా, చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మాత్రం ఉద్రిక్తతలు తలెత్తాయి. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ వేళ పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై చంద్రబాబు ఫైరయ్యారు. కొద్దిసేపటి కిందటే కుప్పం నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిచన చంద్రబాబు.. ఏ క్షణమైనా కుప్పం వచ్చేస్తానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటిదాకా ఉన్న అప్ డేట్స్ ఇవి..

ఏపీలో కొద్ది నెలల కిందటే మున్సిపల్ ఎన్నికలు జరగ్గా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే, అప్పటికి కాలపరమితి తీరని కొన్ని స్థానిక సంస్థలకు ఇవాళ పోలింగ్ జరుగుతున్నది. నెల్లూరు కార్పొరేషన్ తోపాటు ఆకివీడు, బుచ్చిరెడ్డిపాలెం, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, కుప్పం, దర్శి, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ, మున్సిపాలిటీల్లో సోమవారం నాడు పోలింగ్ కొనసాగుతున్నది. కుప్పం మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చెందిన తర్వాత జరుగుతోన్న తొలి ఎన్నికలు కావడంతో పరువు నిలబెట్టుకునేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలుచేస్తుండగా, పరిషత్ ఎన్నికల మాదిరే అక్కడ కూడా వైసీపీ జెండా ఎగరేయాలని అధికార పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది..

కుప్పం మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ వేళ ఉద్రిక్తలు నెలకొనడంతో పోలీసులు.. టీడీపీ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటుండం వివాదాస్పదమైంది. అర్ధరాత్రి నుంచే కుప్పంలో టీడీపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయని, ప్రశాంతమైన వాతావరణాన్ని పోలీసులే చెడగొడుతున్నారని, అధికార వైసీపీ కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కుప్పంలో టీడీపీ నేతల అరెస్టులపై ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఇవాళ ఉదయం నుంచి పలు మార్లు కుప్పం నేలతో కాన్ఫరెన్స్ లో మాట్లాడారాయన. దొంగ ఓట్లను, పోలింగ్ లో అక్రమాలను ధైర్యంగా అడ్డుకోవాలని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ధైర్యం నూరిపోశారు. పరిస్థితి చేయిదాటితే ఏ క్షణంలోనైనా తాను కుప్పం రావడానికి సిద్దంగా ఉన్నానని కార్యకర్తలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు.

కొత్తగా ఏర్పడి, తొలిసారి ఎన్నికలు జరుగుతోన్న కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉండగా, ఒకటి ఏకగ్రీవం కావడంతో 24 వార్డుల్లో ఇవాళ పోలింగ్ జరుగుతున్నది. మొత్తం 48 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటుచేసింది. సమస్యాత్మక ప్రాంతం కావడంతో భారీగా పోలీసులను మోహరించారు. ఏడుగురు పర్యవేక్షకులు పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 39,259 ఓటర్లున్నారు. చంద్రబాబు అడ్డా కావడంతో కుప్పాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ శ్రమిస్తోంది.
Published by:Madhu Kota
First published:

Tags: AP News, Chandrababu naidu, Kuppam, Muncipal elections, Tdp, Ysrcp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు