హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Guntur Girl: మైనర్ బాలికతో వ్యభిచారం.. మాజీ మంత్రి అనుచరుడి అరెస్ట్.. దర్యాప్తులో సంచలన నిజాలు..

Guntur Girl: మైనర్ బాలికతో వ్యభిచారం.. మాజీ మంత్రి అనుచరుడి అరెస్ట్.. దర్యాప్తులో సంచలన నిజాలు..

Minot GIrl: ఆమె నర్సు అని చెప్పడం. బాలిక బాగోగులు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో.. పూర్తిగా ఆ మాయ లేడి మాటలను నమ్మిన తండ్రి.. ఆమెతో పాటు బాలికను పంపించాడు. అలా బాలికను తనతో పాటు తీసుకెళ్లిన ఆ కంత్రీ కిలాడీ లేడీ.. బిజినెస్ ప్రారంభించింది.

ఇంకా చదవండి ...

  Anna Raghu, Guntur, News18

  తండ్రి ఓ ఫ్యాక్టరీలో వాచ్ మెన్. దీంతో పగలంతా ఆ ఫ్యాక్టరీలోనే ఉండాలి.. అతడి భార్య, కూతురు ఇద్దరికీ కరోనా పాజిటివ్నిర్ధారణ అయ్యింది. దీంతో వారి ఇద్దర్నీ గుంటూరు జీజీహెచ్ లో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ అతడి భార్య జూన్ లో ప్రాణాలు విడిచింది. 13 ఏళ్ల బాలికకు నెగిటివ్ వచ్చినా.. కాస్త అనారోగ్యంతో ఇబ్డంది పడేది.. ఆ చిన్నారి బాగోగులు చూసుకోవాల్సిన తల్లి లేదు. తండ్రి వాచ్ మన్ ఎప్పుడు ఫ్యాక్టరీ దగ్గరే ఉండేవాడు.. దీంతో ఆ బాలిక బాగోగులను పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని  గుంటూరు (Guntur) స్వర్ణభారతి నగర్ కు చెందిన ఓ మహిళ ఆ విషయాన్ని తెలుసుకుంది. వెంటనే తాను ఓ ఆస్పత్రిలో నర్సును అని చెప్పి ఆ తండ్రిని పరిచయం చేసుకుంది. బాలిక పరిస్థితి బాగులేదని.. అమ్మ లేని పిల్ల కాబట్టి.. తాను తీసుకెళ్లి నాటు వైద్యం చేయిస్తానని.. ఆరోగ్యంగా తిరిగి వస్తుందని నమ్మించింది.

  ఆమె నర్సు అని చెప్పడం. బాలిక బాగోగులు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో.. పూర్తిగా ఆ మాయ లేడి మాటలను నమ్మిన తండ్రి.. ఆమెతో పాటు బాలికను పంపించాడు. అలా బాలికను తనతో పాటు తీసుకెళ్లిన ఆ కంత్రీ కిలాడీ లేడీ.. బిజినెస్ ప్రారంభించింది. అనారోగ్యంతో ఉందని.. తల్లి లేని పిల్ల అని ఏ మాత్రం జాలి చూపించలేదు. కాసులపై కక్కుర్తితో వ్యభిచార రొంపిలోకి దింపింది. కుటుంబ పరిస్థితులను ఆసరా చేసుకుని మాయ మాటలతో మొదట లొంగదీసుకుంది. ఆమె భయపడి ఇంటికి వెళ్లిపోతానని ఏడవడంతో భయభ్రాంతులకు గురిచేసింది. తండ్రిని, తనను చంపేస్తానని బెదిరింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం చేయించింది. అంత చిన్న వయసులో వ్యభిచారం చేయడం.. అప్పటికే ఆరోగ్యం బాగులేకపోవడంతో ఆమె పరిస్థితి విషమించింది.

  ఇది చదవండి: కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేదానికి.. అంతపని చేయాలా..?

  ఇంతలో విజయవాడ మీదుగా తరలించే సమయం లో బాలిక తప్పించుకొని పేరేచెర్ల లో ఉన్న తండ్రి వద్దకు చేరుకోని తన బాధను వెళ్లబోసుకుంది. దీంతో తండ్రి నిందితురాలుపై మేడికొండూరు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసాడు ఈ ఫిర్యాదును జీరో ఎఫ్ఐర్ నమోదు చేసి కేసును అరండల్‌పేట స్టేషన్‌కు బదిలీ చేశారు. విచారించిన పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఐతే బాలికను విచారించిన్నపుడు ఈ కేసులో మొత్తం నలబై ఐదుమంది వరకు ఉన్నారని నిర్దారణకు వచ్చారు.

  ఇది చదవండి: రాత్రి రూమ్ లోకి వెళ్లి తలుపేసుకున్న యువతి.. తర్వాతి రోజు మధ్యాహ్నం షాకింగ్ దృశ్యం..  ఐతే బాలిక న్యాయమూర్తి ముందు పోలీసులు అందరిని అరెస్ట్ చేయలేదని ఇంకా ఉన్నారని వాంగ్మూలం ఇచ్చింది . వాంగ్మూలం విన్న న్యాయమూర్తి నిర్వాహకులు మరియు విటులను కూడా అదుపులోకి తీసుకోవాలని చెప్పటంతో రాజకీయ నాయకుల అనుచరుల బాగోతాలు బయటపడ్డాయి ఇందులో భాగంగా నిజాంపట్నం కుచెందిన వైసీపీ నేత భూశంకరావు, వ్యభిచార నిర్వాహకుడు కాకినాడకు చెందిన సింహాచలం విటులు శివరామ కృష్ణ, నాగిరెడ్డి శ్రీను, క్రాంతికుమార్ ను అరండల్‌పేట పోలీస్లు అరెస్ట్ చేశారు. ఐతే ఈ కేసులో ఇప్పటివరకు 36 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

  ఐతే వైసీపీకి చెందిన వ్యక్తులు కేసులో అరెస్ట్ అవడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. వైసీపీలో అందరూ నేరస్తులేనంటూ ట్వీట్ చేశారు.

  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Minor girl raped