హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Balayya vs YCP: బాలకృష్ణ ట్వీట్ పై దుమారం.. మంత్రుల ఎదురుదాడి.. నందమూరి కుటుంబం ఒక్కటయ్యేనా?

Balayya vs YCP: బాలకృష్ణ ట్వీట్ పై దుమారం.. మంత్రుల ఎదురుదాడి.. నందమూరి కుటుంబం ఒక్కటయ్యేనా?

బాలయ్యపై మంత్రుల ఎదురుదాడి

బాలయ్యపై మంత్రుల ఎదురుదాడి

Balayya vs YCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త టర్న్ తీసుకున్నాయి.. ప్రస్తుతం వైసీపీ వెర్సస్ నందమూరిగా మారుతున్నాయి..? బాలయ్య చేసిన ట్వీట్ తో పరిస్థితి అలానే కనిపిస్తోంది. బాలయ్య చేసిన ట్వీట్ పై వైసీపీ మంత్రులు ఎదురుదాడికి దిగారు. మరి నందమూరి కుటుంబం ఒక్కటవుతుందా..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Balayya vs YCP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు మరింత హీట్ గా మారాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ (NTR Health University) పేరు మార్పుపై దుమారం రచ్చ రచ్చ అవుతోంది. నాలుగు రోజులు అవుతున్నా ఫైర్ తగ్గడం లేదు. మొదట ఈ వివాదం తారాస్థాయికి చేరుతోంది అనుకున్న సమయంలో.. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ట్వీట్ సైలెంట్ అయ్యేలా చేసింది..  వైఎస్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరూ సమాన స్థాయి నేతలు.. ఒకరి పేరు తీసి మరో పేరు పెట్టినంత మాత్రాన వారి కీర్తి ప్రతిష్టలు తగ్గవు అంటూ ట్వీట్ చేయడంతో.. ఇక రచ్చకు బ్రేక్ పడినట్టే అయ్యింది. నందమూరి కుటుంబ నుంచే ఆ రియాక్షన్ రావడంతో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఫలితం లేనట్టే అని అంతా వివాదాన్ని పక్కనపెట్టారు. అదే సమయంలో బాలయ్య నిప్పులు కురిపించారు. తన తండ్రిపేరుతో ఉన్న యూనివర్సిటీకి జగన్ ప్రభుత్వం పేరు మార్చడంపై నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

  బాలయ్య ఏమన్నారంటే..? ఆయన మాటల్లో చూస్తే.. మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక.. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు.. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు…… పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త… అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అంటూ ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు.

  బాలయ్య ఫైర్ చూసి షాక్ కు గురైన వైసీపీ మంత్రులు.. ఇప్పుడు ఆయనకు కౌంటర్లు ఇచ్చేందుకు క్యూ కట్టారు. అది కూడా సోషల్ మీడియా వేదికగానే.. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎప్పుడు పెట్టారో చెప్పాలని బాలయ్యను మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. మీరంతా కలిసి చంపేశాకే కదా.. చేసిన పాపం పేరు పెడితే పోతుందా అంటూ నిలదీశారు.

  మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం బాలయ్య తీరును ఘాటుగానే ప్రశ్నించారు. అఖండ సినిమాలోని డైలాగ్ పోస్టర్‌తో ఎన్టీఆర్ మీద చంద్రబాబు చెప్పులు వేయిస్తే.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి జగన్ పూలు వేయించారని.. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ బాలయ్యకు ఆయన డైలాగే అప్పగించారు.

  Both are not same…

  మంత్రులు ఒక్కరిద్దరు కాదు.. దాదాపు కేబినెట్ లో ఉన్నవారిలో సగం మంది సోషల్ మీడియా వేదికగా బాలయ్యను టార్గెట్ చేశారు. ఇక అంబటి రాంబాబు సైతం తనదైన స్టైల్లో పంచ్ వేశారు. జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య అంటూ ఎద్దేవ చేశారు.

  విడుదల రజనీ సైతం బాలయ్య తీరును ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రులను పిల్లలను ఎలుకలు కొరికే ఆస్పత్రులుగా.. సెల్‌ఫోన్ లైట్లలో ఆపరేషన్‌లు చేసే ఆస్పత్రులుగా మార్చిన మీ ఎల్లో గ్యాంగ్.. అయినా మెడికల్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరే ఉండాలనుకోవడం.. ఇది కరెక్టేనా అంటూ ట్వీట్ చేశారు. ప్రజల హెల్త్ అంటే మీకు ఎందుకు చులకన అని ప్రశ్నించారు. 104, 108 వాహనాలను పాడుపెట్టి ఆరోగ్యశ్రీని చంపేసి హెల్త్ యూనివర్సిటీకి మాత్రం ఎన్టీఆర్ పేరు ఉంచాలని ఉద్యమాలు చేస్తారా అంటూ నిలదీశారు.

  ఇలా సోషల్ మీడియాలోనే కాదు.. మంత్రి జోగీ రమేష్ అయితే మరో స్థాయిలో మండిపడ్డారు. 3 రోజుల తరువాత బాలకృష్ణ స్పృహలోకి వచ్చినట్లు ఉన్నారని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్‌ను ఈ జాతి నుంచి దూరం చేసిందెవరు? మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిందెవరు? పార్టీని, ట్రస్ట్‌ను లాక్కుని, సీఎం పీఠంపై మీ బావ కూర్చోలేదా? అప్పుడు బాలకృష్ణ ఏం చేశారు? శునకం ఎవరు? ఆ శునకానికి తోక ఎవరు? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇలా మంత్రులు అంతా బాలయ్యపై ఎదురు దాడికి దిగడంతో.. మరి నందమూరి కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి.. ఈ విషయంపై అంతా ఏకతాటిపైకి వస్తుందో లేదో చూడాలి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Ambati rambabu, Andhra Pradesh, AP News, Nandamuri balakrishna, TDP, Vidadala Rajani

  ఉత్తమ కథలు