హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News: ఏపీలో ఎమ్మెల్యేలు, లీడర్లు, అధికారుల ఫోన్లు బిజీ.., కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

AP News: ఏపీలో ఎమ్మెల్యేలు, లీడర్లు, అధికారుల ఫోన్లు బిజీ.., కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

RRR టికెట్ల కోసం జూ.ఎన్టీఆర్ (NTR), రాంచరణ్ (Ram Charan) అభిమానులే కాక సినీ ప్రియులు సైతం టికెట్లకోసం ఎమ్మెల్యే లు, రాజకీయ నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు.

RRR టికెట్ల కోసం జూ.ఎన్టీఆర్ (NTR), రాంచరణ్ (Ram Charan) అభిమానులే కాక సినీ ప్రియులు సైతం టికెట్లకోసం ఎమ్మెల్యే లు, రాజకీయ నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు.

RRR టికెట్ల కోసం జూ.ఎన్టీఆర్ (NTR), రాంచరణ్ (Ram Charan) అభిమానులే కాక సినీ ప్రియులు సైతం టికెట్లకోసం ఎమ్మెల్యే లు, రాజకీయ నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు.

  Anna Raghu, News18­, Guntur

  ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ (RRR Movie). ముఖ్యంగా భారత్ లో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ భారీ మల్టీస్టారర్ మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఎగబడుతున్నారు. రిలీజ్ కు వారం ముందే టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ టికెట్ల (RRR Movie Tickets) గురించే చర్చ జరుగుతోంది. తిరుమల వెంకన్న దర్శనం కోసం సిఫార్సు లేఖలు అడిగినట్లే ఆర్ఆర్ఆర్ టికెట్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు ఫోన్లు వెళ్తున్నాయి. ఈ టికెట్ల కోసం జూ.ఎన్టీఆర్ (NTR), రాంచరణ్ (Ram Charan) అభిమానులే కాక సినీ ప్రియులు సైతం టికెట్లకోసం ఎమ్మెల్యే లు, రాజకీయ నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు.

  ఇక అధికారులైతే తలలు పట్టుకునే పరిస్థితి. పోలీసులు, అధికారులు కూడా థియేటర్ యజమానులకు సిఫార్సులు పంపిస్తుండటంతో ఉన్న టికెట్ల కంటే.. రికమండేషన్లకే ఎక్కువవుతున్నాయంటున్నారు. ఆన్ లైన్లో కూడా రిలీజ్ రోజుకి టికెట్లు దొరకని పరిస్థితి. ఇప్పటికే ఫస్ట్ డేకి సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. బ్లాక్ లో టికెట్లు కొనాలంటే కనీసం రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

  ఇది చదవండి: స్పెషల్ స్టేటస్, 3 క్యాపిటల్స్ మద్యంపై జగన్ క్లారిటీ.. సారా బాబు అంటూ సెటైర్లు.. పవన్, బాలయ్యను వదలని సీఎం

  మొదటి రోజే సినిమాను చూడాలని టికెట్ల కోసం ఎమ్మెల్యేలు, నేతలకు నియోజకవర్గాల నుంచి ఫోన్లు ఎక్కువయ్యాయి. తమ నియోజకవర్గ నేతల నుంచి ఫోన్లు వస్తే టికెట్లు అడుగుతారేమోనని లిఫ్ట్ చేయని పరిస్థితి ఉంది. సాధారణ షోలకు సంగతి పక్కన బెడితే.. ప్రీమియర్లు, బెనిఫిట్ షోల పేరుతో టికెట్లను భారీ ధరకు విక్రయిస్తున్నారు. అర్ధరాత్రి నుంచే షో లు ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అదనపు షోలతో పాటు టికెట్ ధరపై రూ.75 పెంచుకునేందుకు అనుమతులిచ్చింది. దీంతో ఆర్ఆర్ఆర్ టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

  ఇది చదవండి: పార్టీ ఏదైనా.. ప్లాన్ ఒక్కటే.. వారి కోసం వందల కోట్లు.. వ్యూహం గిట్టుబాటు అవుతుందా..?

  రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా బాహుబలి అద్భుతమైన విజయాన్ని అందుకున్న స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, శ్రియ, రాజీవ్ కనకాలతో పాటు విదేశీ నటులు కూడా సినిమాలో ఉన్నారు. ఇప్పటికే ట్రైలర్ తో పాటు సాంగ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. ప్రమోషన్స్ లో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ డైరెక్టర్ రాజమౌళి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, Rrr movie

  ఉత్తమ కథలు