హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vangaveeti Radha: గుడివాడలో వంగవీటి రాజకీయం..? ఆ భేటీ వెనుక కారణం ఇదేనా..?

Vangaveeti Radha: గుడివాడలో వంగవీటి రాజకీయం..? ఆ భేటీ వెనుక కారణం ఇదేనా..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక స్థానముంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా (Krishna District) లో వంగవీటి కుటుంబం(Vangaveeti Family) పై అందరి దృష్టి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక స్థానముంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా (Krishna District) లో వంగవీటి కుటుంబం(Vangaveeti Family) పై అందరి దృష్టి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక స్థానముంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా (Krishna District) లో వంగవీటి కుటుంబం(Vangaveeti Family) పై అందరి దృష్టి ఉంటుంది.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక స్థానముంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా (Krishna District) లో వంగవీటి కుటుంబం(Vangaveeti Family) పై అందరి దృష్టి ఉంటుంది. దివంగత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా కృష్ణ (Vangaveeti Radha Krishna) ఎక్కడికెళ్లినా అభిమానులు ఆదరిస్తుంటారు. ఐతే ఇటీవల రాధా ఓ నియోజకవర్గానికి ఎక్కువగా వెళ్తుండటం, అక్కడే కాపు నేతలతో సమావేశమవుతుండటంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వంగవీటి రాధా ఇటీవల తరచూ మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడలో సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఆయన రాజకీయ భవిష్యత్తుపై రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన గుడివాడ వెళ్లడంపై అందరి దృష్టి నెలకొంది. ఆదివారం గుడివాడ వెళ్లిన రాధా అక్కడ పలువురు కాపు సంఘం ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

  ఈ సమావేశంలో రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. భేటీలో వైసీపీకి చెందిన నేతలే ఎక్కువ మంది హాజరుకావడం చర్చనీయాంశమైంది. ఇటీవల గుడివాడ మీదుగా ప్రయాణించినప్పుడల్లా స్థానిక నేతలను కలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఐతే గుడివాడపై రాధా దృష్టి పెట్టారా..? ఇక్కడ రాజకీయాలు చేయాలనుకుంటున్నారా అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.

  ఇది చదవండి: ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన తమ్ముళ్లు.. చంద్రబాబు రాకున్నా ముందడుగే..!


  గత ఏడాది వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో పర్యటించిన వంగవీటి రాధా.. మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ సమక్షంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి కుట్ర జరుగుతోంది.. రెక్కీ కూడా చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాదు వారి పేర్లు కూడా త్వరలోనే బయటపెడతానని ప్రకటించారు. అదే విషయంపై కొన్నిరోజులు హడావిడి జరిగినా ఆ తర్వాత ఆ ఊసేలేదు.

  ఇది చదవండి: వచ్చేఎన్నికల్లో ఆ వైసీపీ ఎమ్మెల్యేకు టికెట్ లేనట్లేనా..? పోటీగా కీలక నేత అనుచరుడు..


  గతంలో వంగవీటి రాధా మంత్రి కొడాలి నానిపై టీడీపీ అభ్యర్ధిగా బరిలో దిగుతారన్న ప్రచారం జోరుగా సాగింది. గుడివాడ పరిధిలో దాదాపు 30వేల కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉండటం, జిల్లాలో వంగవీటి కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా.. కొడాలి నానిని ఢీ కొట్టే సరైన అభ్యర్ధి రాధా అనే ప్రచారం జరిగినా.. దీనిపై టీడీపీ గానీ, వంగవీటి రాధా గానీ క్లారిటీ ఇవ్వలేదు.

  ఇది చదవండి: వేసవిలో ఏపీ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పరిస్థితేంటి..? అదే సీన్ రిపీట్ అవుతుందా..?


  ఐతే ఇప్పుడు రాధా గుడివాడలో కాపు సంఘం నేతలతో భేటీ కావడం, సమావేశానికి వైసీపీలో ఉన్న నేతలే ఎక్కువమంది రావడంతో అసలు ఆయన వ్యూహం ఏంటనేది ఆసక్తిగా మారింది. ఇది సాధారణ సమావేశమా.. లేక పొలిటికల్ భేటీనా అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. దీనిపై రాధా కూడా స్పష్టమైన ప్రకటన చేయలేదు. గుడివాడలో మాట్లాడేందుకు చాలా టైమ్ ఉందంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, Gudivada, Vangaveeti Radha

  ఉత్తమ కథలు