Home /News /andhra-pradesh /

POLITICAL DISCUSSION OVER SRIKALAHASTI YCP CANDIDATE FOR 2024 ELECTIONS FULL DETAILS HERE PRN TPT

YSRCP: వచ్చేఎన్నికల్లో ఆ వైసీపీ ఎమ్మెల్యేకు టికెట్ లేనట్లేనా..? పోటీగా కీలక నేత అనుచరుడు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YCP) అధికారంలో ఉంది. అధికార పార్టీ చాలా బలంగా కనిపిస్తోంది. కానీ కొందరు ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారెంటీనా అంటే గట్టిగా చెప్పలేని పరిస్థితి. వైసీపీకి కీలకమైన చిత్తూరు జిల్లా (Chittoor District) లో రాజకీయం అలాగే ఉంది.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, Tirupathi, News18

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YCP) అధికారంలో ఉంది. అధికార పార్టీ చాలా బలంగా కనిపిస్తోంది. కానీ కొందరు ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారెంటీనా అంటే గట్టిగా చెప్పలేని పరిస్థితి. వైసీపీకి కీలకమైన చిత్తూరు జిల్లా (Chittoor District) లో రాజకీయం అలాగే ఉంది. ముఖ్యంగా శ్రీకాళహస్తిలో రాజకీయం రసవత్తరంగా మారింది. సాక్షాత్తు శివరాత్రి రోజు జరిగిన ఆలయ పాలకమండలి ప్రమాణస్వీకారం రోజే.. ఎమ్మెల్యే, చైర్మన్ మధ్య విభేదాలు బయటపడ్డట్టు అనుచర వర్గం నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. అంజూరు శ్రీనివాసులు శ్రీకాళహస్తి చైర్మన్ గా బాధ్యతలు శివరాత్రి నాడు ఆలయ కమిటీ సభ్యులతో కలసి ప్రమాణస్వీకారం చేసారు. ఈ ప్రమాణ స్వీకారానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రాకముందే సాగింది. ఎమ్మెల్యే చివరి నిమిషంలో వచ్చిన ఫొటోకు మాత్రమే పరిమితం అయ్యారు.

    దీంతో ప్రమాణస్వీకారోత్సవం నాడే వర్గ విభేదాలు బహిర్గతం అయ్యాయని.., ఆలయ ఉద్యోగులతో పాటు.. వారి అనుచర వర్గం ప్రచారం చేస్తున్నారు. గతంలో అంజూరు శ్రీనివాసులు చాల సార్లు ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఆశించారు. ఎస్సీవీ నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు.. ఆయన తరుపున వైఎస్ రాజశేఖర్ శేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించారు. కానీ ఆ సమయంలో శ్రీనివాసులుకు సానుకూలమైన వాతారవరణం లేకపోవడంతో మౌనం పాటించారు. అనంతరం వైసీపీలో చేరిన తరువాత ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశించినా అప్పటికే ఆ నియోజకవర్గంలో వైసీపీ తరపున పునాదులు వేసుకున్న బియ్యపు మధుసూదన్ కు టిక్కెట్ కేటాయించారు.

    ఇది చదవండి: రాజధానిపై తర్వాతి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి..? జగన్ సర్కార్ వ్యూహం ఏంటి..?


    అప్పటి నుంచి వైసీపీలో కొనసాగుతున్న అంజూరు శ్రీనివాసులు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరునిగా గుర్తింపు పొందారు. దీంతో ఆయనకు శ్రీకాళహస్తి ఆలయ కమిటీ చైర్మన్ గా పదవిని కట్టబెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవి కూడా తమ నేతకేనంటూ శ్రీనివాసులు వర్గం ప్రచారం చేస్తోంది.

    ఇది చదవండి: వేసవిలో ఏపీ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పరిస్థితేంటి..? అదే సీన్ రిపీట్ అవుతుందా..?


    దీనిపై సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూధనరెడ్డి వ్యూహం మరోలా ఉంది. ఒకవేళ తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోతే తన కుమార్తెకు ఇవ్వాలనే కాన్సెప్ట్ లో ఉన్నారట. నియోజకవర్గం ఆమె సందడే కనపడేలా చేస్తున్నారట బియ్యపు మధుసూదన్. చిన్న చిన్న పార్టీ కార్యక్రమాల నుంచి పెద్ద కార్యక్రమాల వరకు శ్రీకాళహస్తిలో పవిత్ర రెడ్డి ఫొటోలు లేని బ్యానర్ ఉండదు. ఎమ్మెల్యే కంటే ఆయన కూతురి బ్యానర్లే ఎక్కువగా ఉంటాయి. ఇటీవల శివరాత్రి వేడుకల్లోనూ శ్రీకాహళహస్తి ఆలయం వద్ద ఎమ్మెల్యే కూతురి హడావుడే ఎక్కువ. సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకల్లో కూడా పవిత్ర అన్నీ తానై వ్యవహరించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎన్నికల వరకు ఆగాల్సిందే..!
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Chittoor, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు