Home /News /andhra-pradesh /

POLITICAL ATTENTION ON BHEEMLA NAYAK MOVIE TDP CHIEF CHANDRA BABU AND NARA LOKESH SLAMS ON YCP GOVERNMENT NGS

Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాపై చంద్రబాబు లోకేష్ ఆసక్తికర కామెంట్స్.. ఏమన్నారంటే..?

పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లా నాయక్’ (Twitter/Photo)

పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లా నాయక్’ (Twitter/Photo)

Chandrababu and lokesh on Bheemla Nayak: ఆంధ్రప్రదేశ్ లో భీమ్లా నాయక్ చుట్టూ రాజకీయం నెలకొంది. ఈ సినిమా కోసం కేవలం పవన్ అభిమానులే కాదు.. రాజకీయ నాయకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. నార లోకేష్ సైతం ఆసక్తికర కామెంట్లు చేశారు.. వారేం అన్నారంటే..?

ఇంకా చదవండి ...
    Chandrababu and lokesh on Bheemla Nayak: ఆంధప్రదేశ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా భీమ్లా నాయక్ ఫీవర్ ఊపు ఊపేస్తోంది. పవన్ అభిమానులు. అయితే సినిమా ఓ వైపు హంగామా చేస్తుంటే..? రాజకీయంగా రచ్చ రచ్చ అవుతోంది. పవన్ కల్యాణ్ పై ఏపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని.. అందుకే బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదని.. అలాగే పెరగాల్సిన ధరలను కూడా పెంచలేదని పవన్ అభిమానులు, విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు భీమ్లా నాయక్ కు ముందు డీజే టిల్లు సినిమా టికెట్లను వంద రూపాయల వరకు విక్రయించారని.. కానీ పవన్ సినిమా అనేసిరిక 35 రూపాలయకంటే ఎక్కువ ధరకు టికెట్లు అమ్మితే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ఏంటని పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా భీమ్లానాయక్ ట్రెండింగ్ గా.. హాట్ టాపిక్ గా నిలుస్తోంది..

    తాజాగా భీమ్లానాయక్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా విషయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ జగన్ వదలడం లేదన్నారు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తులను టార్గెట్‌గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

    భీమ్లా నాయక్’ సినిమాపై ఎందుకు..? అని ఆయన ప్రశ్నించారు. ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్.. తన మూర్ఖపు వైఖరి వీడాలని హితవుపలికారు. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి.. థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు.



    టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం భీమ్లా నాయక్ సినిమాపై స్పందించారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. భీమ్లా నాయక్‌ సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోందని.. తాను కూడా సినిమాని చూడాలని ఎదురు చూస్తున్నాను అన్నారు లోకేష్. వైఎస్ జగన్ ఒక పరిశ్రమ తర్వాత మరో పరిశ్రమను నాశనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ని భిక్షాటన చేసే గిన్నెగా మారుస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. సినీ పరిశ్రమ కూడా దీనికి మినహాయింపు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. భీమ్లా నాయక్ సినిమా ఇలాంటి కుట్రలను అధిగమించి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే లోకేష్ ట్వీట్ చేశారు.

    ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ అభిమానులు, జనసేన నాయకులు కూడా ఈ ట్వీట్ ని షేర్ చేస్తూ ‘భీమ్లా నాయక్’కి సపోర్ట్ చేసినందుకు నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం తీరుపై ఏపీ వ్యాప్తంగా పవన్ అభిమానులు ఆందోళన బాట పట్టారు. నిన్న రాత్రి నుంచి రాష్ట్రంలోని పలు నగరాల్లో పవన్ అభిమానులు నిరసనలు తెలుపుతున్నారు. సినిమాల పట్ల, పవన్ పట్ల ప్రభుత్వం తప్పుగా వ్యవహరిస్తోంది అంటూ ఆందోళనలు చేస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Bheemla Nayak, Chandrababu Naidu, Janasena, Nara Lokesh, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు