Home /News /andhra-pradesh /

POLICES CELEBRATE BABY SHOWER FUNCTION IN PENUGONDA POLICE STATION IN WEST GODAVARI DISTRICT NGS

Baby Shower Function: కాబోయే తల్లికి పోలీస్ స్టేషన్ లోనే ఘనంగా సీమంతం.. ఎందుకో తెలుసా..?

పోలీస్ స్టేషన్ లో సీమంతం వేడుక

పోలీస్ స్టేషన్ లో సీమంతం వేడుక

Baby Shower Function in Police station: సాధారణంగా పోలీస్ స్టేషన్ లో ప్రేమ వివాహాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.. పెద్దలు ఒప్పుకోవడం లేదని మేజర్లు పోలీసులను ఆశ్రయిస్తే వారు వివాహం జరిపించి అండగా నిలుస్తారు.. కానీ ఓ సీమంతం వేడుకకు పోలీసు స్టేషన్ వేదిక అయ్యింది.. కారణం ఏంటో తెలుసా..?

ఇంకా చదవండి ...
    Baby Shower Function in Police station: సాధారణంగా సీమంతం (Baby Shower Function) అనేది పుట్టినింటి వారు తమ కూతురుకు పుట్టబోయే బిడ్డ క్షేమం కోసం చేస్తారు. తొలిసారి తమ బిడ్డ గర్భిణి (Pregnant) అయితే.. ఐదు లేదా ఏడు.. కుదరకపోతే తొమ్మిదో నెలలో మంచి రోజు చూసి సీమంతం చేస్తారు. సీమంతాన్ని సైతం కొందరు పెళ్లి వేడుకలా (Marriage Function) నిర్వహిస్తారు. అలాంటి వేడుకను ఓ పోలీస్ స్టేషన్ ఘనంగా జరిపారు.. పోలీసు స్టేషన్ లో అంటే అప్పుడప్పుడు మేజర్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటే..వారి ప్రేమకు పెద్ధలు భరోసా ఇస్తే పోలీసులు వారికి చట్ట పరమైన రక్షణ కల్పిస్తారు. అవసరమైతే పెద్ధలను సైతం స్టేషన్ కు రప్పించి కౌన్సెలింగ్ ఇస్తారు. ఇంకా కుదరని పక్షంలో.. మేజర్లు కోరుకుంటే పోలీసులు పెద్దలే దగ్గరుండి వారికి పెళ్లి చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో పాటు ఇక స్టేషన్ లో పని చేసే సిబ్బంది కుటుంబ సభ్యులకు సంబంధించి ఏ వేడుకలు జరిగినా పాల్గొనటం ఆనవాయితీగా చాలా చోట్ల జరుగుతుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లోని ఓ పోలీస్ స్టేషన్ లో ఘనంగా సీమంతం వేడుక జరిపించారు.

    పెనుగొండ పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లీలారాణి ఇటీవల గర్భవతి అయ్యారు. అయితే ఆమె పట్ల స్టేషన్ లో అంతా చాలా గౌరవ భావంతో ఉండేవారు. ఆమె కూడా స్టేషన్ లో పని చేసే సిబ్బందిని అంతా తన ఆత్మీయులుగానే చూసే వారు. దీంతో ఆమె సీమంతం వేడుకను పెనుగొండ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ నాగేశ్వరరావు, సబ్ ఇన్స్‌పెక్టర్ మోహన్ రావు, సహోద్యోగులు ఘనంగా నిర్వహించారు. ముత్తయిదువులు, పేరాంటాళ్లను పిలిచి అందరితోనూ అక్షింతలు వేయించారు. పోలీస్ స్టేషన్‌లో ఘనంగా సీమంతం వేడుక నిర్వహించారు. పసుపు, కుంకుమలు, గాజులు, పూలు, పండ్లు, గంధం, అక్షింతలతో ముత్తయిదువులుగా ఉన్న ఉద్యోగులు గాజులు తొడిగి.. పెద్ద మనసుతో ఆశీర్వదించారు. పోలీసులే దగ్గరుండి అన్నీ తామై ఈ వేడుక జరిపించడంతో చాలా ప్రత్యేకంగా నిలిచింది.

    సీమంతం అనే వేడుక నెలలు సమీపించే సమయంలో ప్రసవంపై భయం తొలిగి బంధువులు అందరూ తనకు అండగా ఉన్నారనే ధైర్యం ఇస్తుందంటుంది. ఆ స్త్రీమూర్తికి మానసికపరమైన ఉల్లాసం లభిస్తుంది. ముత్తయిదువులంతా వచ్చి ఆశీర్వదించడం, వారి ఆశీర్వాదం తీసుకోవటం శుభకరంగాను భావి స్తుంటారు. అలాగే లీలారాణికి తోటి ఖాఖీలు అంతా తాము అండగా ఉన్నామనే భరోసా కల్పించారు.

    ఇదీ చదవండి : ఆ ఊరంతా ఖాళీ.. పశువులు కూడా మాయం.. నిర్మానుష్యానికి అసలు కారణం ఇదే

    నిత్యం కేసులు, దర్యాప్తులు, ఫిర్యాదులు, సమస్యలతో నలిగిపోయే పోలీసులు కాస్త ఆ టెన్షన్ ను పక్కన బెట్టి ఇలా కార్యక్రమం చేయటంతో కానిస్టేబుల్ లీలారాణిలో పట్టరాని సంతోషం కనిపించింది. దీంతో ఆ స్టేషన్ మత్తం సందడి నెలకొంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు