హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Booby Traps: మావోయిస్టుల బూబీ ట్రాప్ ల నిర్వీర్యం.. అసలేంటి ట్రాప్.. ఎలా టార్గెట్ చేస్తారు?

Booby Traps: మావోయిస్టుల బూబీ ట్రాప్ ల నిర్వీర్యం.. అసలేంటి ట్రాప్.. ఎలా టార్గెట్ చేస్తారు?

బూబీ ట్రాప్స్

బూబీ ట్రాప్స్

Maoists traps: మావోయిస్టుల అతి ముఖ్యమైన యుద్ధవ్యూహాల్లో బూబీ ట్రాప్ ఒకటి.. పోలీసులను తమ వలలో చిక్కుకునేందుకు వీటిని ఏర్పాటు చేస్తారు. అలాంటి ట్రాప్ లను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఇది మావోలకు కోలుకోని దెబ్బే అని చెప్పాలి..

P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18,

Maoist Traps:  మావోయిస్టులు (Maoists) వ్యూహాత్మక యుద్ధ తంత్రంలోముఖ్యమైన  భాగం బూబీ ట్రాప్ (Booby traps).. భద్రతా బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు  ఏర్పాటు చేసేదే బూబి ట్రాప్. పదునైన ఇనుమ మేకులు.. చెక్కిన వెదురు కొమ్ములతో గోతిలో పోలీసులు పడేలా చేసేదే ఈ బూబీ ట్రాప్.  గుంతలో పడిన సదరు భద్రతా బలగ సిబ్బంది చిత్రవధ అనుభవిస్తూ చనిపోవడమే ఈ ట్రాప్ ముఖ్యోద్దేశం. మావోయిస్టుల యుద్ధ తంత్రంలో ఇదో వ్యూహం. ఇలాంటి ఎన్నో గుంతల్ని ఏజెన్సీ ప్రాంతమైన చింతూరు (Chintur)లో పోలీసులు కనుగొన్నారు.  ఏజెన్సీ మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో బూబీ ట్రాప్ లు ఉన్నాయని తూర్పు ఇంటలిజెన్స్ కి సమాచారం అందింది. భారీ విధ్వంసానికి వ్యూహం రచించిన మావోయిస్టుల పన్నాగాన్ని పోలీసులు భగ్నం చేశారు. చింతూరు అడవుల్లో మావోయిస్టులు బూబి ట్రాప్స్‌ అమర్చినట్టు గుర్తించారు.  పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు పది ప్రదేశాల్లో అమర్చిన బూబి ట్రాప్స్‌ని కనుగొన్న పోలీసులు వాటిని వెలికితీశారు. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దునున్న చింతూరు మండలం మల్లెంపేటలో ఇవి శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. ఏరియా డామినేషన్‌లో భాగంగా చింతూరు, ఎటపాక సీఐల నేతృత్వంలో యాంటీ నక్సల్స్‌ స్వ్కాడ్‌, సీఆర్‌పీఎఫ్‌ (CRDF) బలగాలు చేపట్టిన కూంబింగులో బూబి ట్రాప్‌లను గుర్తించారు.

ఎలా తయారు చేస్తారంటే..? వెదురు బొంగులను బాణాల మాదిరిగా చెక్కి వాటిని పది అడుగుల గోతుల్లో మావోయిస్టులు అమరుస్తారు. ఇదే ఇక్కడ కూడా కూర్చారు. అవి కనిపించకుండా ఆ గోతుల పైభాగం మట్టి, ఆకులు కప్పి ఉంచారు. భూమిలో పది అడుగుల లోతు వరకు కందకాలను తవ్వి దానిలో వెదురు బొంగులను బాణాల్లా సూది మొనల్లా చెక్కి అమరుస్తారు.

ఇదీ చదవండి: రూమ్ కి వస్తేనే డ్యూటీ అన్నాడు.. తరువాత ఏం జరిగిందంటే..?

పైన ఆకులు అలములతో కప్పి కూంబింగ్ కు వచ్చే భద్రత బలగాలని వాటిలో చిక్కుకుని వెదురు బొంగుల బాణాలు గుచ్చుకునే  విధంగా చేస్తారు. అటు వెళ్లే భద్ర తా బలగాలు వాటిని గుర్తించక ఆ గోతుల్లో అడుగువేసిన మరుక్షణమే గాయపడే విధంగా మావోయిస్టులు వ్యూహం రచించారు. ఇప్పటివరకు మావోయిస్టులు ఛత్తీస్‌గడ్‌ అడవుల్లో బూబి ట్రాప్స్‌ అమర్చడం తెల్సిందే.

ఇదీ చదవండి: పోలీసులకు చిక్కిన అంతర్జాతీయ రెడ్ స్మగ్లర్.. ఎలా చిక్కాడంటే..?

ఇప్పుడు చింతూరు అడవుల్లో ఈ తరహా విధ్వంసానికి తెరలేపారు. కూంబింగుకు వెళ్లిన భద్రతా బలగాలు బూబి ట్రాప్స్‌లో చిక్కుకొని తీవ్రంగా గాయపడిన సందర్భాల్లో అప్పటికే అక్కడ కాచుక్కూర్చున్న మావోయిస్టులు భద్రతా బల గాలపై కాల్పులు జరుపుతారు. భద్రతా బలగాలు బూబి ట్రాప్స్‌లో చిక్కుకుని ఆత్మ స్థైర్యాన్ని కోల్పోతారో అదే అదనుగా మావోయిస్టులు పోలీసులపై కాల్పులకు తెగబడ తారు. ఇటువంటి ఘటనలు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పలుమార్లు జరుగుతూ ఉంటాయి.

ఇదీ చదవండి: ఏపీ అప్పులు 6 లక్షల కోట్లు.. ఇలా అయితే కష్టమే..? జగన్ సర్కార్ పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

కూంబింగ్ పార్టీలే టార్గెట్..

ప్రధానంగా మావొయిస్టుల కోసం జల్లెడ పట్టే కూంబింగ్ పార్టీలే మావోలకు టార్గెట్. వారికోసమే ఈ వ్యూహం. వీటినే చింతూరులో బలగాలు గుర్తించి ధ్వంసం చేశారు. గొరిల్లా యుద్ధ  వ్యూహం.. ల్యాండ్ మైన్ లు, క్లేమోర్ మైన్లు ఏర్పాటు గతంలో కూడా విన్నదే. కానీ.. బూబీ ట్రాప్ అనేది మాత్రం యుద్ద తంత్రంలో కాస్తంత దారుణమైనదనే చెప్పాలి.

ఇదీ చదవండి: నలుగురూ అమ్మాయిలే.. అబ్బాయి కావాలనుకున్నారు.. చివరికి పోలీసులకు చిక్కారు

నిరంతర తనిఖీలలో భాగంగా ఏజెన్సీ ప్రాంతం ఆంధ్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మల్లం పేట గ్రామ అటవీ ప్రాంతంలో చింతూరు ఏఎస్పీ జి. కృష్ణ కాంత్ నేతృత్వంలో వెలికి తీశారు. చింతూరు, ఎటపాక సర్కిల్ ఇన్స్పెక్టర్ ల సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. యాంటీ నక్సల్ స్క్వాడ్, సిఆర్పిఎఫ్ బలగాలు ఏరియా డామినేషన్లో  భాగంగా కూంబింగ్ పార్టీలే టార్గెట్ గా ఈ ట్రాప్ లు ఏర్పాటు చేశారని భద్రతా అధికారులు వెల్లడించారు. మావోయిస్టులు 10 బూబి ట్రాప్ లను అమర్చారని వాటిని ధ్వంసం చేసినట్టు చెప్పారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Maoist, Naxals, Visakha

ఉత్తమ కథలు