హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chittoor Woman: ఏపీలో జైభీమ్ తరహా ఘటన... అమాయకురాలిని చితకబాదిన పోలీసులు.. చివరికేమైందంటే..!

Chittoor Woman: ఏపీలో జైభీమ్ తరహా ఘటన... అమాయకురాలిని చితకబాదిన పోలీసులు.. చివరికేమైందంటే..!

బాధితురాలు ఉమామహేశ్వరి

బాధితురాలు ఉమామహేశ్వరి

AP Police: పేదింటి మహిళే కదా అనే చులకన తనమో, లేక ఏమి చేసినా ఎవరూ అడగరు కదా అనే ధైర్యమో గానీ పోలీసు కావరంను ఓ దళిత మహిళపై ప్రదర్శించారు. ఏ పాపం ఎరుగని ఆ మహిళను లాఠీలతో కొట్టి చిత్రహింసలకు గురి చేశారు.. నాలుగు గోడల మధ్యలో జరిగిన ఘటన బయటికి రావడంతో ఆమెతో కాళ్లబేరానికి దిగారు పోలీసులు.

ఇంకా చదవండి ...

M BalaKrishna, Hyderabad, News18

పేదింటి మహిళే కదా అనే చులకన తనమో, లేక ఏమి చేసినా ఎవరూ అడగరు కదా అనే ధైర్యమో గానీ పోలీసు కావరంను ఓ దళిత మహిళపై ప్రదర్శించారు. ఏ పాపం ఎరుగని ఆ మహిళను లాఠీలతో కొట్టి చిత్రహింసలకు గురి చేశారు.. నాలుగు గోడల మధ్యలో జరిగిన ఘటన బయటికి రావడంతో ఆమెతో కాళ్లబేరానికి దిగారు పోలీసులు. బేరానికి ఆ మహిళా ఒప్పుకోక పోవడంతో తప్పుడు కేసులు బనాయించేందుకు రెడీ అయ్యారు.. అచ్చం జైభీం సినిమాను తలపించే ఈఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంశంగా మారింది.   ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా కు (Chittoor)  చెందిన ఉమామహేశ్వరిది రెక్క ఆడితే గానీ డొక్క ఆడని పరిస్ధితి. ఐదో తరగతి వరకూ మాత్రమే చదువుకున్న ఉమామహేశ్వరీ.. భర్తతో కలిసి సొంత గ్రామం అయినా గుడిపాల మండలం, రామాపురంలో గ్రామంలో నివసిస్తూ ఉండేది.

అయితే బ్రతుకు తెరువు కోసం ఏడాదిన్నర క్రితం చిత్తూరు నగరంలోని లక్ష్మీనగర్‌ కాలనీకి వచ్చింది. ఉమామహేశ్వరీ భర్త భవన నిర్మాణ కార్మికుడు కావడంతో కరోనా వల్ల పనులు లేక ఇంటి వద్దే ఉండేవాడు. దీంతో కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. కుటుంబ పరిస్ధితులు దృష్టిలో ఉంచుకుని ఉమామహేశ్వరి పనికి పోవాల్సిన పరిస్ధితి వచ్చింది. దీంతో ఏడాదిగా నగరంలోని మైథిలి అపార్టుమెంటులో జైలు సూపరింటెండెంట్‌ వేణుగోపాల్‌రెడ్డి ఇంటితో పాటు మరో ఐదు ఇళ్లల్లో పనిమనిషిగా చేరింది. రోజులాగానే జైల్ సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంటికి ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు పనికి వెళ్ళింది.

ఇది చదవండి: రెండు రోజులు.. మూడు లవ్ స్టోరీలు.. అన్నింటికీ అనుకోని ముగింపు..


అప్పటికే జైల్ సూపరింటెండెంట్ వేణుగోపాల్‌రెడ్డి సతీమణి విజయ టెన్షన్ టెన్షన్ గా ఇల్లంతా ఇళ్ళు అంతా జల్లెడ పడుతోంది. అసలు ఇంటిలో ఏం జరుగుతుందో అర్ధం కానీ ఉమామహేశ్వరీ "ఏమైంది అమ్మాగారూ" ఏం వెతుకుతున్నారు అంటూ ప్రశ్నించింది. దీనికి ఆగ్రహించిన విజయ ఒక్కసారిగా ఉమామహేశ్వరిపై తీవ్ర స్ధాయిలో మండిపడుతూ ఇంట్లో దాచిన నగదును నువ్వే ఎత్తుకెళ్ళావు అంటూ గట్టిగా కేకలు వేసింది. అసలు ఏమైంది తనకు దొంగతనంకు సంబంధం ఏంటని అర్ధం కాక ఉన్న మహేశ్వరిని విజయా మరోక‌సారి పోలీసులకు పట్టిస్తాం అంటూ బెదరింపులకు పాల్పడింది.

ఇది చదవండి: ఆమె ఓ ఖతర్నాక్ లేడీ.. ఒకేసారి ఇద్దరితో ఎఫైర్.. ఎవరితో ఉంటే వాళ్లే భర్తగా పరిచయం.. ఇంతలో షాకింగ్ ట్విస్ట్..!


ఆవెంటనే ఇంటికెళ్లి భోజనం చేసి రావాలసని ఆదేశించింది. దీంతో ఇంటికి వెళ్ళిన అరగంటకే స్టేషన్ కు రావాలంటూ ఉమామహేశ్వరికి వన్ టౌన్ పోలీసులు ఫోన్ చేశారు. అక్కడికి వెళ్లగానే ఆమె వేలిముద్రలు తీసుకున్న పోలీసులు రాత్రి 9గంటల వరకు స్టేషన్లోనే ఉంచారు. మరుసటి రోడు ఉదయం 11గంటలకు భర్తతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఉమామహేశ్వరిని మహిళా కానిస్టేబుల్ తో పాటు మరో కానిస్టేబుల్ విచక్షణారహితంగా కొట్టారు. కరుడుగట్టిన నేరస్తుడ్ని కొట్టినట్లు లాఠీలతో చావబాదారు. మహిళ అని కూడా చూడకుండా ఒంటిపై ఇష్టమొచ్చినట్లు చేతులు వేస్తూ చిత్రహింసలకు గురిచేశారు. సీఐ వచ్చి చచ్చిపోతుందని చెప్పడంతో కాసేపు వదిలేశారు. గంట తర్వాత మళ్లీ కొట్టడం ప్రారంభించడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

ఇది చదవండి: ఎనిమిదేళ్లుగా సహజీవనం.. ప్రియురాలిపై అనుమానం.. సంబంధం లేని వ్యక్తులు బలి..


ఇంతలో పోలీస్ స్టేషన్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఉమామహేశ్వరి వేలిముద్రలు సరిపోలేదనేది ఆఫోన్ కాల్ సారాంశం. వెంటనే నీ తప్పులేదని చెప్పారు. ఆమె భర్తను పిలిచి జరిగిన విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పి ఆస్పత్రికి పంపారు. తర్వాతి రోజు ఆశ్పత్రికి వచ్చిన హెడ్ కానిస్టేబుల్... జరిగిన విషయం ఎవరికీ చెప్పకుండా ఉంటే డబ్బులిస్తామంటూ ఆశచూపించాడు. అందుకు వారు సమ్మతించకపోవడంతో అక్రమ కేసు పెట్టి లోపలేస్తామని బెదిరించారు. అయినా భయపడని ఉమామహేశ్వరి తనకు న్యాయం చేయాలంటూ మీడియాను ఆశ్రయించింది. దీంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పోలీసులు ఆమె విషయంలో తప్పును ఒప్పుకుందంటూ డీఎస్పీ పేరుతో ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. ఇంతలో డీఐజీ సెంథిల్‌కుమార్‌, ఎఎస్‌పి మహేష్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేశారు. కానిస్టేబుల్‌ సురేష్‌బాబును నిందితునిగా నిర్ధారించి సస్పెండ్ చేస్తున్నట్లు నిన్న ఉదయం ప్రకటన విడుదల చేశారు.


ఇది చదవండి: మూడు నెలల క్రితమే పెళ్లి.. మంచి ఉద్యోగం.. కానీ ఇంతలోనే అలా చేస్తుందనుకోలేదు..

ఉన్నతాధికారులేమన్నారంటే..?

ఈ వ్యవహారంపై చిత్తూరు డీఎస్పీ సుధాకర్ మాట్లాడుతూ.. "వన్ టౌన్ పోలీసు స్టేషనులో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సురేష్ బాబుపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం. అతను చేసిన తప్పుకు భాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశాం. మరోక సారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. పోలీసులు ప్రజల‌ పట్ల నిబద్ధత కలిగి ఉండాలే గానీ అహంకారంతో ఇబ్బందులకు గురి గురి చేయరాదు. ఇలాంటి ఘటనలు మల్లి పురాణావృతం కాకుండా చూస్తామని" న్యూస్18కి తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, AP Police, Chittoor

ఉత్తమ కథలు