Home /News /andhra-pradesh /

POLICE SET FIRE TO 2LAKS KILOS OF GANZA IN VISAKHAPATAM ANDHRA PRADESH AS DGP GAUTHAM SAWAND MADE KEY COMMENTS FULL DETAILS HERE PRN VSP

Ganja Smuggling: విశాఖలో 2లక్షల కిలోల గంజాయికి నిప్పు.. స్మగ్లింగ్ పై డీజీపీ ఏమన్నారంటే..

విశాఖలో 2లక్షల కిలోల గంజాయి ధ్వంసం

విశాఖలో 2లక్షల కిలోల గంజాయి ధ్వంసం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం గంజాయి స్మగ్లింగ్ (Ganja Smuggling) పై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తూర్పు గోదావరి (East Godavari), విశాఖపట్నం (Visakhapatnam) ఏజెన్సీ ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో సాగవుతున్న గంజాయిని స్వాధీనం చేసుకొని తగలబెట్టారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం గంజాయి స్మగ్లింగ్ (Ganja Smuggling) పై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తూర్పు గోదావరి (East Godavari), విశాఖపట్నం (Visakhapatnam) ఏజెన్సీ ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో సాగవుతున్న గంజాయిని ధ్వంసం చేయడంతో పాటు పోలీసుల కళ్లుగప్పి రవాణా చేస్తున్న గంజాయిని, లిక్విడ్ గంజాయిని కూడా భారీ మొత్తంలో స్వాధీనం చేసుకుంది. ఆపరేషన్ పరివర్తన్ పేరుతో గంజాయి సాగు వల్ల వచ్చే సమస్యలను గిరిజనులకు వివరించి వారి సాయంతోనే గంజాయి తోటలను ధ్వంసం చేయింది. ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న గంజాయిని దగ్ధం చేసింది. రికార్డు స్థాయిలో 2లక్షల కిలోల గంజాయిని ఒకేసారి దగ్ధం చేసింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ తో సహా పోలీసులు ఉన్నతాధికారులు, స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో స్మగ్లింప్ పై ఉక్కుపాదం మోపుతున్నట్లు వివరించరు. ఆంధ్రా ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో దశాబ్దాలుగా గంజాయి అక్రమసాగు కొనసాగుతుందని.., పలు రాష్ట్రాలకు చెందిన ముఠాలు ఏవోబి లో యదేచ్చగా గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని డీజీపీ తెలిపారు. గంజాయి ని సమూలంగా నాశనం చేసేందుకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గంజాయి స్మగ్లర్లు దేశ వ్యాప్తంగా ఉన్నారని.., వివిధ మార్గాల్లో గుట్టుగా గంజాయి రవాణా చేస్తున్నారన్నారు. మావోయిస్టులు గంజాయి పండించేందుకు సహకరిస్తూ.. దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారని సవాంగ్ పేర్కొన్నారు.

    ఇది చదవండి: ఏపీకి ప్రత్యేక హోదా..? కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతోందా..?


    ఒడిశాలోని 23 జిల్లాలో, విశాఖ ఏజెన్సీలో 11 మండలాల్లో గంజాయి సాగవుతోందని.. ఆపరేషన్ పరివర్తన ద్వారా 11 మండలాల్లో 313 శివారు గ్రామాల్లో 406 ప్రత్యేక బృందాలతో 9251.32 కోట్లు విలువ చేసే 7,552 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం చేసినట్లు డీజీపీ తెలిపారు. గిరిజనులు స్వచ్ఛందంగా 400 ఎకరాలు ధ్వంసం చేసారన్నారు. గంజాయి రవాణా నివారణ కోసం 120 అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఎర్పాటు చేశామన్నారు. ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగావిశాఖ లో గంజాయి సాగు సరఫరా చేస్తున్న వారిపై 577 కేసులు నమోదు చేసి 1500 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

    ఇది చదవండి: భర్త ఫోన్ తీసుకున్న భార్య.. అందులోని వీడియోలు చూసి ఫ్యూజులు ఎగిరిపోయాయి..


    ఇప్పటి వరకు 47,987 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడంతో పాటు 46.41 లీటర్లు హషిష్ ఆయిల్, 314 వాహనాలు సీజ్ చేశమన్నారు గౌతమ్ సవాంగ్. ఇతర రాష్ట్రాల కు చెందిన 154 మంది స్మగ్లర్లుతో పాటు కొత్తగా 300 పై కొత్తగా హిస్టరీ షీట్లు తెరిచినట్లు వివరించారు. నాలుగు జిల్లాలో 1,363 కేసులు నమోదు చేశామని.. ఈ నాలుగు జిల్లాల పరిధిలో పట్టుబడిన 2 లక్షల కేజీల గంజాయి దగ్ధం చేసినట్లు సవాంగ్ తెలిపారు.

    ఇది చదవండి: బస్సులో వెళ్తున్న పెళ్లి బృందం.. పోలీసులు రాగానే పరార్.. అసలు కారణం ఇదే..!


    ఏజెన్సీలో నక్సల్ ప్రభావం తగ్గిపోతుందని.., ఏజెన్సీలో మార్పు మొదలైందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అభిప్రాయపడ్డారు. గిరిజనుల గంజాయి సాగు వైపు వెళ్లకుండా 1963 అవగాహన కార్యక్రమాలు 93 ర్యాలీలు నిర్వహించామున్న డీజీపీ.. గిరిజనులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళేలా ప్రోత్సహిస్తామన్నారు. గంజాయి ఇప్పుడు హషిష్ ఆయిల్ రూపంలో కొత్త రూపం తీసుకుందని.., దాని మీద కూడ ఉక్కపాదం మోపుతున్నామన్నారు. గంజాయి విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారని రాజకీయ నాయకులు అనడం సరికాదని.., సరైన సమాచారం విషయం తెలియకుండా మాట్లాడటం బాధాకరమని సవాంగ్ అన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP DGP, Ganja smuggling, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు