Home /News /andhra-pradesh /

POLICE OFFICIALS AERIAL SURVEY AT AOB SU

పెరిగిన మావోల కదలికలు.. సరిహద్దుల్లో పోలీసుల ఏరియల్ సర్వే..

ఏరియల్ సర్వే(Aerial Survey)

ఏరియల్ సర్వే(Aerial Survey)

రెండు రోజుల క్రితం ఒడిషాలోని కలహండి జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య రెండుసార్లు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతిచెందారు.

    ఖమ్మం : తెలంగాణ- ఆంధ్ర- ఒడిషా సరిహద్దుల్లో పోలీస్ అధికారులు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. గత కొన్ని రోజులుగా ఏఓబీలో మావోయిస్టులు కదలికలు పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు రోజుల క్రితం ఒడిషాలోని కలహండి జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య రెండుసార్లు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో ఏవోబీలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు.

    ఈ క్రమంలోనే ఆంధ్ర, ఒడిషాకు చెందిన నిఘా విభాగం దండకారణ్యం సహా ఏఓబీలో హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. చిత్రకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని అల్లూరి కోట పప్పు లూరు, కప్పతొట్టి, కుర్మనూరు, ఆంధ్రా లోని గుమ్మి రేవుల ,పాతకోట, సీలేరు గూడెంకొత్తవీధి తదితర అటవీ ప్రాంతాల్లో పోలీసులు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు.
    Published by:Sumanth Kanukuka
    First published:

    Tags: Maoists

    తదుపరి వార్తలు