నా కొడుకునే కొడతావా... నెల్లూరులో కానిస్టేబుల్‌ చొక్కా పట్టుకుని మరో పోలీస్...

నన్నే కొడతావా అంటూ ఆ యువకుడు పోలీస్ అధికారి అయిన తండ్రికి ఫోన్ చేశాడు. కొడుకు మీద లాఠీ దెబ్బ పడడంతో తండ్రి మరో బైక్ వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు.

news18-telugu
Updated: March 28, 2020, 8:56 PM IST
నా కొడుకునే కొడతావా... నెల్లూరులో కానిస్టేబుల్‌ చొక్కా పట్టుకుని మరో పోలీస్...
దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి సగటున 556 టెస్టులు చేస్తున్నారు.
  • Share this:
నెల్లూరులో విధుల్లో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని అర్ధరాత్రి రచ్చ రచ్చ చేశాడు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్డు మీదకు వచ్చిన ఓ యువకుడిని కొట్టినందుకు రచ్చ రచ్చ చేశాడు. నెల్లూరు నగరంలో ఇరుకళల పరమేశ్వరీ సెంటర్ లో గత రాత్రి ఈ ఘటన జరిగింది. ఓ పోలీస్ అధికారి కొడుకు అర్ధరాత్రి సమయంలో బుల్లెట్ బైక్ మీద రోడ్డు మీదకు వచ్చాడు. దీంతో విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్ అతడిని లాఠీతో కొట్టాడు. నన్నే కొడతావా అంటూ ఆ యువకుడు పోలీస్ అధికారి అయిన తండ్రికి ఫోన్ చేశాడు. కొడుకు మీద లాఠీ దెబ్బ పడడంతో తండ్రి మరో బైక్ వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చీ రావడంతోనే బూతులు తిడుతూ పోలీస్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని అతడి మీద దాడి చేశాడు. సుమారు ఆరు నిమిషాల పాటు అతడు విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని నడిరోడ్డు మీద బీభత్సం సృష్టించాడు. మరో వైపు ‘వద్దు నాన్నా. వీడియో తీస్తున్నారు.’ అని చెప్పినా కూడా వినకుండా కానిస్టేబుల్‌ను తిడుతూనే ఉన్నాడు ఆ పోలీస్ అధికారి. ఈ తతంగం మొత్తం మరో కానిస్టేబుల్ తీసిన వీడియోలో రికార్డు అయింది. తన కొడుకు వేసుకొచ్చిన బుల్లెట్ బైక్ తాళాలు ఇవ్వాలంటూ కొద్దిసేపు వాదించాడు. అనంతరం ఎస్పీతో చెబుతా అంటూ వెళ్లిపోయాడు.
Published by: Ashok Kumar Bonepalli
First published: March 28, 2020, 8:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading