Tirumala: శ్రీవారి భక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కారణం ఏంటంటే..

ఆందోళన చేపట్టిన భక్తులపై కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు

Tirumala News: సిబ్బందితో గొడవపడ్డ ఐదుగురు భక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

  • Share this:
    తిరుమలలో ఆందోళనకు దిగిన శ్రీవారి భక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్వామి వారీ దర్శనం కోసం ప్రజాప్రతినిధుల సిపారస్సు లేఖలను తీసుకోలేదంటూ నిన్న టీటీడీ అదనపు ఈవో కార్యాలయం దగ్గర కొందరు భక్తులు ధర్నా చేశారు. అదనపు ఈవో కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి తమకు స్వామి దర్శనం కల్పించాలంటూ నిన్న గోకులం అతిధి గృహం వద్ద ధర్నాకి దిగిన భక్తులపై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీటీడీ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు గోదావరి జిల్లాలు, గుంటూరు, విశాఖపట్నంకి చెందిన భక్తులపై సెక్షన్ 151 సిఆర్‌పిసి క్రింద 7 మంది భక్తులపై కేసు నమోదు చేశారు.

    మరోవైపు నేడు మహరాష్ట్రకి చెందిన భక్తులపై సిబ్బంది ఫిర్యాదు చేశారు. మహరాష్ట్రకి చెందిన మంత్రి జారీ చేసిన సిఫార్సు లేఖ జిరాక్స్ కాపీపై దర్శనం కేటాయించాలని కార్యాలయ సిబ్బందిని భక్తులు కోరగా...ఒరిజనల్ లెటర్ ఉంటేనే దర్శనం కేటాయిస్తామని సిబ్బంది తెలిపారు. అయితే వారి మాట వినకుండా భక్తులు తమతో వాగ్వాదానికి దిగారంటూ అదనపు ఈవో కార్యాలయం సిబ్బంది పోలిసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో సిబ్బందితో గొడవపడ్డ ఐదుగురు భక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు స్వామివారి దర్శనం కోసం ఆందోళన చేసిన భక్తులపై పోలీసులు కేసు నమోదు చేయడం విమర్శలకు దారితీస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: