Home /News /andhra-pradesh /

POLICE INVOLVED IN MURDER CASE FOR EXTRAMARITAL AFFAIR IN KURNOOL DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Affair: ఇద్దరు మహిళలతో ఏఎస్ఐ రాసలీలలు.. వారిలో ఒకరి హత్యకు స్కెచ్.. చివరకు ఇలా చిక్కాడు

కర్నూలులో ప్రియురాలిని హత్య చేయించిన ఏఎస్సై

కర్నూలులో ప్రియురాలిని హత్య చేయించిన ఏఎస్సై

Kurnool Crime News: అతనో పోలీస్. తప్పుచేసిన వారికి మంచి చెప్పడం.. అయినా వినకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం ఆయన డ్యూటీ. నలుగురుకి మంచి చెప్పాల్సిన వాడు.. దారితప్పాడు. చివరకు హత్య చేయించేవరకు వెళ్లాడు.

    Anna Raghu, Guntur, News18­

    అతనో పోలీస్. తప్పుచేసిన వారికి మంచి చెప్పడం.. అయినా వినకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం ఆయన డ్యూటీ. నలుగురుకి మంచి చెప్పాల్సిన వాడు.. దారితప్పాడు. నేరస్తులను శిక్షించాల్సిన వాడు నేరస్తుడిగా మారాడు. ఇందుకు కారణం వివాహేతర సంబంధం. ఒకేసారి ఇద్దరు మహిళలలో వ్యవహారం నడిపి వారిలో ఒకర్ని దారుణంగా హత్య చేయించాడు. చివరకు కటకటాలు లెక్కిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) అవుకు పోలీస్ స్టేషన్లో ఫక్రుద్దీన్ ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు. ఆయనకు పెళ్లైంది. ఇద క్రమంలో ఐదేళ్ల క్రితం భర్తను కోల్పోయి ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్న సుమలత అనే మహిళతో ఫక్రుద్దీన్ కు పరిచయమైంది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారడంతో తరచూ ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు.

    ఐతే సుమలతకు అదే పట్టణానికి చెందిన బొడ్డు సుజాత అనే మహిళతో స్నేహముంది. ఈ క్రమంలో సుజాత.. సుమలత దగ్గర ఆరు లక్షలు అప్పుగా తీసుకుంది. మరోవైపు ఫక్రుద్దీన్ తో గొడవ కారణంగా.. సుమలత అతడ్ని దూరం పెట్టింది. ఐతే మరొకరితో చనువుగా ఉంటూ తనను దూరం పెట్టిందని ఫక్రుద్దీన్ సుమలతపై కక్ష పెంచుకున్నాడు. మరోవైపు తాను ఇచ్చిన డబ్బులు తిరిగివ్వమని అడగడంతో సుజాత కూడా సుమలతపై కోపం పెంచుకుంది. ఇదిలా ఉంటే సుమలత ద్వారా.. సుజాతతో పరిచయం పెంచుకున్న ఫక్రుద్దీన్ ఆమెతో కూడా ఎఫైర్ పెట్టుకున్నాడు.

    ఇది చదవండి: ఒక్క మాట 'YES' అంటే సరిపోయేది.. ఇంతలో ఎంత ఘోరం! బావమరదళ్ల కన్నీటి కథ


    మరోవైపు తాను ఇచ్చిన అప్పు తిరిగివ్వాలని సుమలత.. సుజాతపై ఒత్తిడి చేసింది. దీంతో డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని సుజాత.. తన స్నేహితురాలిని అడ్డుతొలగించుకోవాలని భావించింది. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ ఫక్రుద్దీన్ దీనికి మరింత ఆజ్యం పోశాడు. సుమలతపై ఆగ్రహంతో ఉన్న ఆయన హత్య ఎలా చేయాలో, చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలో నిందితులకు సూచనలిచ్చాడు. సుజాతకు రామకృష్ణ, వసంత అనే వారు జత కలిశారు.

    ఇది చదవండి: ప్రియుడ్ని సీక్రెట్ గా ఇంటికి పిలుపించుకున్న భార్య.. కాసేపటి తర్వాత ఊహించని ట్విస్ట్..


    ఫక్రుద్దీన్ సూచనలతో సుమలతను జనవరి 16న దారుణంగా హత్య చేశారు. హత్యకు సంబంధించిన ఆధారాలేవీ దొరక్కపోవంతో పోలీసులు విచారణ తీవ్రం చేశారు. ఈ క్రమంలో సుమలతతో ఫక్రుద్దీన్ కు ఉన్న ఎఫైర్ సంగతి బయటపడింది. లోతుగా విచారిస్తే ఫక్రుద్దీన్ డైరెక్షన్లోనే ఇదంతా జరిగినట్లు నిర్ధారణ అయింది. హత్యే కేసుతో సంబంధమున్న నిందితులను పట్టుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఫక్రుద్దీన్ కోసం గాలిస్తున్నారు. బాధ్యతాయుతమైన పోలీస్ వృత్తిలో ఉంటూ హత్యను ప్రోత్సహించడంతో సుమలత ముగ్గురు పిల్లలు దిక్కులేనివారయ్యారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Extramarital affairs, Kurnool

    తదుపరి వార్తలు