ఇదేందయ్యా పోలీసు.. అండర్‌వేర్‌లో పోలీస్ స్టేషన్‌కు..

అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల యూనిఫాం వేసుకోకుండా అతను స్టేషన్‌కు వచ్చాడు.

news18-telugu
Updated: July 15, 2019, 9:33 AM IST
ఇదేందయ్యా పోలీసు.. అండర్‌వేర్‌లో పోలీస్ స్టేషన్‌కు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పోలీస్ స్టేషన్‌ అంటే ఎప్పుడూ నలుగురు వస్తుంటారు.. పోతుంటారు.. అలాంటి చోట పోలీసులు యూనిఫాంలో కాకుండా అర్థనగ్నంగా ఉంటే ఎలా ఉంటుంది..? ఏదైనా ఫిర్యాదు కోసం మహిళలు పోలీస్ స్టేషన్‌కు వస్తే.. ఆ అవతారంలో పోలీసులను చూస్తే పరిస్థితేంటి..? పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలంటేనే ఇప్పటికీ చాలామందిలో ఒకరకమైన భయం. అలాంటి చోట బాధ్యతగా వ్యవహరించాల్సిందిపోయి.. ఓ పోలీస్ ఏకంగా అండర్‌వేర్ పైనే స్టేషన్‌కు వచ్చాడు.ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది.

అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల యూనిఫాం వేసుకోకుండా అతను స్టేషన్‌కు వచ్చాడు.పైన చొక్కా వేసుకన్న అతను.. కింద మాత్రం కేవలం అండర్‌వేర్‌తో ఉన్నాడు. అదే అవతారంలో స్టేషన్‌లో
చాలాసేపు దర్జాగా అటూ ఇటూ తిరిగాడు. స్టేషన్‌లోని వ్యక్తులు రహస్యంగా అతని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఫోటోలు వైరల్‌గా మారగా.. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.సదరు పోలీసుపై అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.First published: July 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>