Devaragattu Stick Fight: పోలీసుల నిషేదాజ్ఞలు.. దేవరగట్టులో టెన్షన్ టెన్షన్

దసరా వచ్చిందంటే చాలు చాలా మంది దృష్టి దేవరగట్టులో జరిగే కర్రల సమరంపై ఉంటుంది. రణరంగాన్ని తలపించేలా జరిగే ఈ ఉత్సవంలో ప్రజలు ఒకరినొకరు కర్రలతో బాదుకుంటారు.

news18-telugu
Updated: October 26, 2020, 9:07 AM IST
Devaragattu Stick Fight: పోలీసుల నిషేదాజ్ఞలు.. దేవరగట్టులో టెన్షన్ టెన్షన్
దేవరగట్టు కర్రల సమరం(ఫైల్ ఫొటో-credit - twitter - Priti Suman)
  • Share this:
దసరా వచ్చిందంటే చాలు చాలా మంది దృష్టి దేవరగట్టులో జరిగే కర్రల సమరంపై ఉంటుంది. రణరంగాన్ని తలపించేలా జరిగే ఈ ఉత్సవంలో ప్రజలు ఒకరినొకరు కర్రలతో బాదుకుంటారు. నెత్తురోడుతున్న పట్టించుకోకుండా కర్రల సమరంలో పాల్గొంటారు. ఈ సమరంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సైతం ఉన్నాయి. అయినా ప్రతి ఏటా దసరా సందర్భంగా అక్కడి ప్రజలు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాద కరోనా నేపథ్యంలో కర్రల సమరం జిల్లా అధికారులు నిషేదాజ్ఞలు విధించారు. క‌రోనాతో ఈ ఉత్స‌వాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు క‌ర్నూలు జిల్లా క‌లెక్ట‌ర్ వీర‌పాడియ‌న్ ఆదేశాలు జారీచేశారు.

ప్రజలు పూజా కార్యక్రమాలు యథావిధిగానే జరుగుతాయని అధికారులు తెలిపారు. పండుగను ప్రజలు ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అలాగే ఆలూరు, హోలగొంద, ఆస్పరి, మండలాలలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అలాగే దేవరగట్టుకు రాకపోకలపై అంక్షలు విధించారు. స్థానికులు మాత్రం అధికారుల నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేవరగట్టు పరిసర గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల అంక్షల నేపథ్యంలో నేడు రాత్రి జరగాల్సిన కర్రల సమరం జరుగుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక, కర్నూలు జిల్లాలో... దేవరగట్టు కొండలో మాళ మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా బన్నీ ఉత్సవం జరుగుతుంది. ఉత్సవ విగ్రహాల్ని దక్కించుకోవడానికి... పలు గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకోవడం దేవరగట్టులో ఆనవాయితీ. సమస్యేంటంటే... కర్రలతో ఇష్టమొచ్చినట్లు కొట్టేసుకుంటారు. దాదాపు యుద్ధం జరిగినట్లే. ప్రాణాలు పోతున్నా, ఎంతలా రక్తం వస్తున్నా... అస్సలు లెక్కచేయరు. దేవుడున్నాడు... చూసుకుంటాడు... అంటారు. ఫలితంగా ఏటా ఈ ఉత్సవంలో కొంత మంది ప్రాణాలు పోతున్నాయి.
Published by: Sumanth Kanukula
First published: October 26, 2020, 9:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading