ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం

ఆంధ్ర-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల‌కు చెందిన డంప్‌ను గురువారం ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

news18-telugu
Updated: November 12, 2020, 11:04 PM IST
ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్ర-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల‌కు చెందిన డంప్‌ను గురువారం ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా పోలీసుల‌కు అందిన ముంద‌స్తు స‌మాచారం ప్ర‌కారం మ‌ల్క‌న్‌గిరి జిల్లా క‌టాఫ్ ఏరియాలోని జొడొంబో పోలీసుస్టేష‌న్ ప‌రిధిలోని అర‌ప‌ద‌ర్‌-ఆండ్రాప‌ల్లి అట‌వీప్రాంతంలో గాలింపు చ‌ర్య‌ల‌ను నిర్వ‌హిస్తున్న బీఎస్ఎఫ్, ఒడిశా పోలీసుల‌కు మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను క‌నుక్కున్నారు. ఈ డంప్‌లో రెండు మందుపాత‌ర‌లు, 14 హ్యాండ్ గ్రైనెడ్‌లు, 13 ఎల‌క్ట్రిక్ డిటోనేట‌ర్స్‌, 9 ఎంఎం పిస్ట‌ల్ కు చెందిన 55 రౌండ్స్‌ బుల్లెట్స్, 303 తుపాకీ చెందిన 93 రౌండ్స్ బుల్లెట్స్ ఉన్న‌ట్లు ఒడిశా మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఎస్పీ రిషికేష్ కిల్లారి తెలిపారు. ఏవోబీ ఎస్‌జ‌డ్‌సీకు చెందిన మావోయిస్టులకు చెందిన సామాగ్రిగా గుర్తించామ‌ని , వీటిని అమాయ‌కులైన గిరిజ‌నుల‌ను ల‌క్ష్యంగా చేసుకోవ‌డంతో బాటు గాలింపునకు వ‌చ్చే బ‌ల‌గాల‌ను లక్ష్యంగా చేసుకుని వీటిని వాడ‌టానికి దాచిపెట్టార‌ని మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఎస్పీ తెలిపారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 12, 2020, 11:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading