Home /News /andhra-pradesh /

POLICE CEASED HUGE CASH AT NALLAJARLA OF WEST GODAVARI DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Eluru News: ట్రావెల్స్ బస్సులో షాకింగ్ సీన్.. ఆ బ్యాగ్ తెరిచి నోరెళ్లబెట్టిన పోలీసులు.. అందులో ఏముందంటే..!

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా నగదు స్వాధీనం

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా నగదు స్వాధీనం

ఐతే ఇంత పెద్దమొత్తంలో నగదు పంపడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉగాది సందర్భంగా శ్రీకాకుళంలో బంగారం సేల్స్ బాగా జరుగుతాయని.. అందుకే అంతపెద్ద మొత్తంలో నగదు పంపారన్న టాక్ వినిపిస్తోంది.

  అదో టోల్ ప్లాజా.. పక్కనే పోలీసుల చెక్ పోస్ట్ కూడా ఉంది. ప్రతి రోజు మాదిరిగానే ఆ రోజు కూడా పోలీసులు ప్రతివాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోనూ తనిఖీలు చేశారు. అందులో బ్యాగు అనుమానాస్పదంగా కనిపించడంతో తెరిచి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. అందులో ఏకంగా రూ.5కోట్ల నగదును చూసి పోలీసులు నోరెళ్లబెట్టారు. వివరాల్లోకి వెళ్తే.., ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari) నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద ట్రావెల్స్ బస్సులో పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం నుంచి గుంటూరు వెళ్తున్న పద్మవతి ట్రావెల్స్ బస్సును టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. బస్సులో లగేజ్ చెక్ చేస్తుండగా ఓ బ్యాగ్ లో భారీగా నగదు దొరికింది.

  పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదును లెక్కించగా రూ.4.76 కోట్లు ఉన్నట్లు తేలింది. నగదును సీజ్ చేసిన పోలీసులు డ్రైవర్, క్లీనర్ తో పాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలపై ఆరా తీయగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు బంగారు నగల వ్యాపారులు గుంటూరులో బంగారం కొనుగోలు చేసేందుకు ఈ డబ్బును పంపినట్లు తెలుస్తోంది. డబ్బంతా ఒకరిది కాదని.. నలుగురైదుగురు వ్యాపారులకు చెందినదిగా సమాచారం. డబ్బుతో పాటు కొంత బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: రాత్రి పొలంలోనే పడుకున్నాడు.. ఉదయాన్నే మంచంపై షాకింగ్ దృశ్యం.. ఆ రాత్రి ఏం జరిగింది..?


  ఐతే ఇంత పెద్దమొత్తంలో నగదు పంపడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉగాది సందర్భంగా శ్రీకాకుళంలో బంగారం సేల్స్ బాగా జరుగుతాయని.. అందుకే అంతపెద్ద మొత్తంలో నగదు పంపారన్న టాక్ వినిపిస్తోంది. డబ్బుకు సరైన పత్రాలు చూపిస్తే వదిలేస్తామని పోలీసులు చెబుతున్నారు. నగదుకు సంబంధించిన వ్యక్తులకు సమాచారం అందించారు.

  ఇది చదవండి: భర్తను వదిలేసి ప్రియుడే లోకమనుకుంది.. కానీ అంతలోనే ఊహించని పరిణామం..


  ఏపీలో ఎక్కువగా కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద బస్సులు, వాహనాల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడుతుంటుంది. ఇప్పటికే పలుసార్లు కోట్ల రూపాయల డబ్బులను పోలీసులు సీజ్ చేశారు. ఇటీవల ఓ బస్సులో సోదాలు చేస్తుండగా.. ఐదుగురు ప్రయాణికుల నుంచి భారీగా నగదుతోపాటు బంగారం, వెండి లభ్యమైంది. 28.5 కేజీల వెండి బిస్కెట్లు, 8.250 కేజీల బంగారు బిస్కెట్లు, 90 లక్షల నగదు సీజ్‌ చేశారు. పట్టుబడిన వారంతా తమిళనాడులోని సేలం పట్టణానికి చెందిన దేవరాజు, సెల్వరాజు, కుమార వేలు, మేయలాగ మురుగేశన్, కోయంబత్తూరుకు చెందిన వెంకటేశ్‌గా గుర్తించారు. అయితే వీరంతా వినూత్న రీతిలో వీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చొక్కాలో, జిప్‌ జేబులో దాచి పెట్టారు. గత ఏడాది ఇదే రూట్ లో ఏకంగా 105 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, West Godavari

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు