అమరావతిలో ఉద్రిక్తత... 426 మంది రైతులపై కేసులు నమోదు

Amaravati : అమరావతిలో తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే... పోలీసులు తమపై దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు స్థానిక రైతులు.

news18-telugu
Updated: February 20, 2020, 12:14 PM IST
అమరావతిలో ఉద్రిక్తత... 426 మంది రైతులపై కేసులు నమోదు
అమరావతిలో ఉద్రిక్తత... రైతులపై కేసులు... (File)
  • Share this:
Amaravati : ఏపీలో రాజధాని అమరావతి ఉద్యమం కొనసాగుతోంది. రోజూ స్థానికులు, రైతులూ... తన నిరసనలు తెలుపుతూ దీక్షలు కొనసాగిస్తున్నారు. ఐతే... అనుమతులు లేవంటూ ఈ నిరసనలను పోలీసులు అడ్డుకుంటుంటే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాజాగా మరో రకమైన నిరసన వ్యక్తమైంది. బుధవారం తహశీల్దార్ వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చెయ్యాల్సిందేననీ, ఇలా వాహనాల్లో తిరిగితే సరిపోదనీ, తమను పట్టించుకోని నేతలు, అధికారులను అడ్డుకుంటామని రైతులు ప్రకటించారు. అప్రమత్తమైన పోలీసులు రైతుల్ని నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఐతే... దాదాపు 500 మంది రైతులు వాహనం ఎలా ముందుకెళ్తుందో చూస్తామంటూ... రోడ్డుపైనే బైటాయించడంతో... పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తాజాగా కృష్ణాయపాలెం‌కి చెందిన 426 మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మంగళగిరి రూరల్ పోలీస్‍స్టేషన్‍లో ఈ కేసులు నమోదయ్యాయి. వాహనాన్ని అడ్డుకోవడం, పబ్లిక్ న్యూసెన్స్ సహా 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే రైతులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

దాదాపు రెండు నెలలకు పైగా ధర్నాలు, నిరాహార దీక్షలూ చేస్తున్నా... వైసీపీ ప్రభుత్వం మాత్రం అమరావతిలోనే పరిపాలనా రాజధానిని ఉంచాలని అనుకోవట్లేదు. ఇదే స్థానిక రైతులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రభుత్వ మాత్రం... టీడీపీ ఉచ్చులో పడొద్దనీ, మూడు రాజధానుల్లో భాగమైన అమరావతిని కూడా అభివృద్ధి చేస్తామని చెబుతోంది. ఈ వ్యాఖ్యల్ని స్థానిక రైతులు నమ్మట్లేదు. విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించవద్దని కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఉగాది నుంచీ విశాఖ నుంచే పరిపాలన సాగించేందుకు ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది.

First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు