వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్... ఎందుకంటే...

Kotam Reddy Sridhar Reddy Arrest : జమీన్ రైతు వారపత్రిక అధినేత డోలేంద్ర ప్రసాద్ మీద కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తున్న తరుణంలో ఈ అరెస్టు సంచలనం అయ్యింది. కోటంరెడ్డి తీరుపై టీడీపీ, బీజేపీ, సీపీఎం పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: October 6, 2019, 11:31 AM IST
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్... ఎందుకంటే...
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  • Share this:
Kotam Reddy Sridhar Reddy Arrest : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు అయ్యారు. వెంకటాచలం ఎంపీడీవో సరళ కేసు విషయంలో పోలీసులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఈ ఉదయం అరెస్టు చేసి తీసుకెళ్లారు. తన ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని MPDO సరళ... ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సరళ కంప్లైంట్‌పై ఎంక్వైరీ జరిపిన పోలీసులు... అది నిజమే అని తేలడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇందుకోసం పోలీసులు శనివారం రాత్రి నుంచీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి దగ్గర వెయిట్ చేశారు. రాత్రంతా ఎదురుచూసిన పోలీసులు... తెల్లారి బయటకు వచ్చిన శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల తర్వాత ఆయన్ని నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. వ్యక్తిగత విషయాల్ని కొందరు రాజకీయం చేస్తున్నారన్న కోటంరెడ్డి... తాను ఏ తప్పూ చెయ్యలేదని అన్నారు. విచారణలో నిజాలు బయటికొస్తాయని అన్నారు.

ఇంతకుముందు పోలీసులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. గత ఆదివారం రాత్రి జమీన్ రైతు వారపత్రిక అధినేత డోలేంద్ర ప్రసాద్ మీద కోటంరెడ్డి దాడి చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తయి. ఆ కేసులో కూడా కోటంరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పత్రికాధినేతపై కోటంరెడ్డి వ్యవహరించిన తీరుపై టీడీపీ, బీజేపీ, సీపీఎం పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మీడియాపై దాడులకు నిరసనగా జర్నలిస్ట్ సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాయి. కోటంరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జర్నలిస్ట్ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కూడా కోటంరెడ్డిపై సీఎం జగన్‌కి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Published by: Krishna Kumar N
First published: October 6, 2019, 7:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading