పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్.. రచ్చ రచ్చ.. రంగంలోకి దిగిన ఫ్యాన్స్.. అరెస్ట్ చేసిన పోలీసులు

పోసాని కృష్ణమురళి, పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్‌పై పోసాని కృష్ణమురళి తీవ్రమైన విమర్శలు చేయడాన్ని తట్టుకోలేకపోయిన పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు.. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌కు చేరుకుని ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

 • Share this:
  తన భార్య, కుటుంబంపై పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు అనుచితమైన కామెంట్స్ చేస్తూ మెసేజ్‌లు చేస్తున్నారని మండిపడ్డ పోసాని కృష్ణమురళి.. వారికి కౌంటర్ ఇచ్చేందుకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన కుటుంబంపై అనుచితమైన విమర్శలు చేసి తనను డిమోరలైజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కొందరు ఫోన్ చేసి తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారని పోసాని మండిపడ్డారు. తన కుటుంబంపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా ? అని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌పై పరుషపదజాలంతో విమర్శలు చేశారు.

  పవన్ కళ్యాణ్‌పై పోసాని కృష్ణమురళి తీవ్రమైన విమర్శలు చేయడాన్ని తట్టుకోలేకపోయిన పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు.. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌కు చేరుకుని ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు.. పోసాని కృష్ణమురళిని అడ్డుకునేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులను అదుపులోకి తీసుకున్నారు.

  మరోవైపు పోసాని కృష్ణమురళిపై అభిమానులు దాడి చేసే అవకాశం ఉంటడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనను పోలీసు ఎస్కార్ట్ వాహనంలో ఆయన ఇంటి దగ్గర దించాలని నిర్ణయించారు. అయితే పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళికి బుద్ధి చెబుతామని అభిమానులు హెచ్చరిక చేశారు. పవన్ కళ్యాణ్ సైకో కాదు.. పోసాని కృష్ణమురళి పెద్ద సైకో అంటూ నినాదాలు చేశారు. అభిమానులు ప్రెస్ క్లబ్ ముందుకు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

  IT Return: ఆఖరి నిమిషం వరకు ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయలేదా?.. ఫైన్ కట్టాల్సిందే.. ఎంతంటే..

  LPG Cylinder: కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలా ? ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు..

  పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసే క్రమంలో పోసాని కృష్ణమురళి తీవ్ర పదజాలం వాడటంతో.. పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయనే అంశం ఉత్కంఠగా మారింది. మొదట కేవలం పవన్ కళ్యాణ్‌పై మాత్రమే విమర్శలు చేసిన పోసాని కృష్ణమురళి.. ఆ తరువాత ఆయన కుటుంబం మొత్తాన్ని టార్గెట్ చేసినట్టుగా వ్యాఖ్యలు చేయడం మెగా అభిమానులకు ఆగ్రహం కలిగించింది. ఇప్పటికే వైసీపీకి, జనసేనకు మధ్య మాటల యుద్ధం సాగుతున్న నేపథ్యంలో... తాజా ఎపిసోడ్ ఈ వ్యవహారాన్ని ఎటువైపు తీసుకెళుతుందో అనే చర్చ జరుగుతోంది.
  Published by:Kishore Akkaladevi
  First published: