హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirupati: సినిమా స్టైల్లో దోపిడీకి స్కెచ్.. ప్లాన్ పక్కాగా అమలు చేశారు.. కానీ అక్కడే తేడా కొట్టింది..!

Tirupati: సినిమా స్టైల్లో దోపిడీకి స్కెచ్.. ప్లాన్ పక్కాగా అమలు చేశారు.. కానీ అక్కడే తేడా కొట్టింది..!

పోలీసుల అదుపులో నిందితులు

పోలీసుల అదుపులో నిందితులు

Shocking: తప్పుచేసి దొరికిపోయిన చోట అదే తప్పు చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడవ్వాలని కన్నింగ్ స్కెచ్ వేశాడు. అంతా బాగానే మేనేజ్ చేసినా చిన్న క్లూ అతగాడిని పట్టించింది.

  GT Hemanth Kumar, News18, Tirupati

  పోయినచోటే వెతుక్కోవాలనేది పెద్దల మాట. అందుకే ఓ వ్యక్తి అదే ప్లాన్ వేశాడు. కానీ పొగొట్టుకున్నచోట వెతుక్కోవడం కాదుగానీ.. తప్పుచేసి దొరికిపోయిన చోట అదే తప్పు చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడవ్వాలని కన్నింగ్ స్కెచ్ వేశాడు. అంతా బాగానే మేనేజ్ చేసినా చిన్న క్లూ అతగాడిని పట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన తిర్గిక శ్రీనివాసరావు అనే వ్యక్తి 12 ఏళ్లుగా బంగారం వ్యాపారం చేస్తున్నాడు. గత ఏడాది ఇతని దగ్గర పనిచేసే లక్ష్మణ్ ద్వారా చెన్నై నుంచి బంగారు కడ్డీలు తెప్పిస్తుండగా.. విజయవాడకు చెందిన కస్టమ్స్ అధికారులు అతడ్ని పట్టుకొని బంగారాన్ని సీజ్ చేశారు. ఆ ఘటనతో శ్రీనివాసరావు బాగా నష్టపోయాడు. అప్పులపాలయ్యాడు.

  ఐతే నరసరావుపేటకు చెందిన వ్యాపారులే తన బంగారంపై సమాచారం ఇచ్చారని భావించిన శ్రీనివాస్.. వారికి కూడా టోకరా వేయాలని చూశాడు. పోయినచోటే వెతుక్కోవాలని భావించాడు. అందుకే టైమ్ కోసం ఎదురుచూశాడు. అదే తరహాలో బంగారు వ్యాపారస్తులు డబ్బులు పంపి బంగారం తెప్పించే విషయం తెలుసుకున్నాడు. దొడ్డిదారిలో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని మార్కాపురం కు చెందిన తన బంధువైన దుర్గారావుతో కలిసి స్కెచ్ వేశాడు. బంగారు తీసుకు రావడానికి యజమాని సతీష్ ఇచ్చిన 90 లక్షల నగదుతో మొహర్ శ్రీనివాస్ నర్సారావుపేట నుంచి 8వ తేదీ తిరుపతికి బయలుదేరారు.

  ఇది చదవండి: ప్రతిరాత్రి ఆ మాట చెప్పాల్సిందే..! సిలబస్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్.. ఆ కాలేజీలో అమ్మాయిలకు చెప్పే పాఠాలివే..!


  విషయం తెలుసుకున్న తిర్గిక శ్రీనివాసరావు వ్యూహం అమలు చేశాడు. నరసరావుపేట నుంచి శ్రీనివాస్ బయలుదేరినప్పటి నుంచి తిర్గిక శ్రీనివాస రావు, మిరిశెట్టి శ్రీను కారును అద్దెకు తీసుకొని వీరనాల గంగాధర్, సయ్యద్ హుసైన్ బాషా, పఠాన్ రసూల్, సయ్యద్ హుసైన్ బాషా, మున్నంగి రమేష్ తో కలిసి రుపతికి చేరుకున్నారు. బంగారం కోసం చెన్నై వెళ్తున్న మొహర్ శ్రీనివాస్ తిరుపతి లోని ఉదయ్ ఇంటర్నేషనల్ ముందు బస్సు దిగగానే., నిందితులు తాము ఐడీ పార్టీ పోలీసులమని... బ్యాగ్ చెక్ చేయాలంటూ మొహర్ ను బెదిరించారు. అతడ్ని కారులో ఎక్కించుకొని చంపేస్తామని బెదిరించి 90లక్షలతో పాటు.. మొబైల్ ఫోన్ ను తీసుకోని, బెంగళూరు హైవేపై వదిలేశారు. అతడి మొహల్ ను ఓ నీటి కుంటలో పడేసి పారిపోయారు. వెంటనే తేరుకున్న జరిగిన విషయాన్ని యజమాని సతీష్ కు చెప్పాడు.

  ఇది చదవండి: వాళ్లిద్దరిదీ ఓ క్యూట్ లవ్ స్టోరీ.. కానీ ఆజంట విధిరాత ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేకపోయారు..!


  కేసు నమోదు చేసుకున్న పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. నిందితులు వినియోగించిన కారు ఆధారంగా దర్యాప్తు చేయగా.. నిందితుల ఆచూకీ తెలిసింది. చెన్నై-కోల్ కతా హైవేపై నాయుడుపేట క్రాస్ వద్ద నిదితులను గుర్తించారు. దొంగిలించిన సొమ్మును బంగారంగా మార్చుకొని అదే కారులో వస్తుండగా నిందితులు పోలీసులకు చిక్కారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Robbery, Tirupati

  ఉత్తమ కథలు