అమరావతి రాజధాని భూ కుంభకోణం కేసులో ఇద్దరు అరెస్ట్...

అమరావతి రాజధాని భూ కుంభకోణం కేసులో మరో ఇద్దరిని తుళ్ళూరు పోలీసులు అరెస్టు చేశారు.

news18-telugu
Updated: July 15, 2020, 7:23 PM IST
అమరావతి రాజధాని భూ కుంభకోణం కేసులో ఇద్దరు అరెస్ట్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమరావతి రాజధాని భూ కుంభకోణం కేసులో మరో ఇద్దరిని తుళ్ళూరు పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ కు చెందిన గుమ్మడి సురేష్, తుళ్లూరు రిటైర్డ్ తహసిల్దార్ సుధీర్ బాబును అరెస్ట్ చేశారు. అసైన్డ్ భూములు కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. భూ రికార్డులు వ్యవహారంలో తారుమారు చేసినట్లు సుధీర్ బాబు పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అరెస్టు చేసిన ఇద్దరినీ బుధవారం మంగళగిరి కోర్టుకు హజరుపరిచారు. విచారణ నిమిత్తం ఈనెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించారు.

కొన్ని రోజుల క్రితం ఏపీ సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ మాధురిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్ట్ చేసింది. 2016లో రాజధాని ప్రాంతంలోని రావెల గోపాల కృష్ణ అనే వ్యక్తికి ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. అక్రమంగా భూములను బదలాయించినట్లు దర్యాప్తులో తేలడంతో మాధురిని అరెస్ట్ చేశారు. అంతకు ముందు రావెల గోపాలకృష్ణను కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆయన చెప్పిన వివరాల ఆధారంగా సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్‌ను కూడా అరెస్ట్ చేశారు. కాగా, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి భూములపై ప్రత్యేక దృష్టిపెట్టింది. చంద్రబాబునాయుడు హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని.. వాటిని బయటపెట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాజధాని భూములపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 15, 2020, 7:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading