HOME »NEWS »ANDHRA PRADESH »police arrest rss activists in srisailam temple union minister kishan reddy dials ap dgp gowtham sawang sk

శ్రీశైలం ఆలయంలో RSS కార్యకర్తలు, పోలీసుల ఫైట్.. రంగంలోకి కేంద్రమంత్రి

శ్రీశైలం ఆలయంలో RSS కార్యకర్తలు, పోలీసుల ఫైట్.. రంగంలోకి కేంద్రమంత్రి
ప్రతీకాత్మక చిత్రం

ఈ వ్యవహారంపై ఆరాతీసిన డీజీపీ గౌతమ్ సవాంగ్.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించిన నలుగురు సెక్యూరిటీ సిబ్బందిని తొలగించారు.

  • Share this:
    శ్రీశైలంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. శ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జునస్వామి ఆలయ దర్శనం విషయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పలు కారణాలు చెప్పి.. ఆలయంలోకి అనుమతివ్వకపోవడంతో పోలీసులతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న RSS నేతలు.. ఈ విషయాన్ని కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఏపీ డీజీపీకి గౌతమ్ సవాంగ్‌కు కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. ఈ వ్యవహారంపై ఆరాతీసిన డీజీపీ గౌతమ్ సవాంగ్.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించిన నలుగురు సెక్యూరిటీ సిబ్బందిని తొలగించారు. అంతేకాదు శ్రీశైలం సెక్యూరిటీ ఆఫీసర్‌తో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లలపై బదిలీ వేటు వేశారు. అనంతరం శ్రీశైలం కొత్త సెక్యూరిటీ ఆఫీసర్‌గా శ్రీహరిని నియమించారు. విచారణాధికారిగా డీఎస్పీ వెంకట్రావును నియమించారు డీజీపీ. ఆయన ఆదేశాల మేరకు ఘటనపై డీఎస్పీ విచారణచేపట్టారు.
    Published by:Shiva Kumar Addula
    First published:September 20, 2020, 10:42 IST