Home /News /andhra-pradesh /

POLICE ARREST PSYCHO SERIAL KILLER IN PENDURTHI VISAKHAPATNAM UMG

దడపుట్టించిన సైకో కిల్లర్ అరెస్ట్.. మర్డర్ చేసి ప్రైవేట్ పార్ట్స్‌పై తన్నేవాడు.. భార్య అక్రమ సంబంధమే వీటికి బీజం.. విచారణలో నమ్మలేని నిజాలు

సీరియల్ కిల్లర్‌ని పట్టుకున్న పోలీసులను అభినందిస్తున్న సీపీ

సీరియల్ కిల్లర్‌ని పట్టుకున్న పోలీసులను అభినందిస్తున్న సీపీ

వారం రోజుల వ్యవధిలో మూడు హత్యలు చేసి విశాఖ (Vizag) వాసులను వణికించిన సైకో కిల్లర్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. పెందుర్తి (Pendurthi) వరుస హత్యల కేసును అత్యంత వేగంగా ఛేదించి సీరియల్ కిల్లర్‌ (Serial Killer)ను పట్టుకున్నారు. అసలు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు.. ఏ కారణంతో చేయాల్సి వచ్చిందని పోలీసులు విచారిస్తే నమ్మలేని నిజాలు ఎన్నో బయటకు వచ్చాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    వారం రోజుల వ్యవధిలో మూడు హత్యలు చేసి విశాఖ (Vizag) వాసులను వణికించిన సైకో కిల్లర్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. పెందుర్తి (Pendurthi) వరుస హత్యల కేసును అత్యంత వేగంగా ఛేదించి సీరియల్ కిల్లర్‌ (Serial Killer)ను పట్టుకున్నారు. అసలు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు.. ఏ కారణంతో చేయాల్సి వచ్చిందని పోలీసులు విచారిస్తే నమ్మలేని నిజాలు ఎన్నో బయటకు వచ్చాయి. ఇంకా ఇలా ఎవరినైనా హతమార్చాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

    పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ వివరాల మేరకు.. అనకాపల్లి జిల్లా కోటవురట్లకు చెందిన రాంబాబుకు సుమారు 30 ఏళ్ల కిందట వివాహమైంది. అతనికి 27 ఏళ్ల కొడుకు, 26 ఏళ్ల కూతురు కూడా ఉన్నారు. 2018వ సంవత్సరంలో భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం చూసిన రాంబాబు మహిళలంటే ద్వేషం పెంచుకున్నాడు. అంతేగాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న సమయంలో యజమాని చేతిలో మోసపోవడంతో మానసికంగా పూర్తిగా దెబ్బతిన్నాడు. దీనికితోడు పిల్లలు కూడా దగ్గరికి రానివ్వకపోవడంతో అందరి మీద పూర్తి ద్వేషం పెంచుకున్నాడు.

    ఇదీ చదవండి: ఉత్తరాంధ్రలో సీరియల్ కిల్లింగ్స్.. మళయాళం సినిమా టైప్‌లో అర్ధరాత్రి హత్యలు.. సైకో పనేనా..?


    భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మహిళల మీద కక్ష పెంచుకున్న రాంబాబు మహిళలను చంపేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. వారం రోజులు కిందట వాచ్‌మెన్ దంపతులను హత్య చేశాడు. ఆ చంపిన వాళ్లలో మహిళ ఉన్నారా లేదా అనీ తెలుసుకునెందుకు ప్రైవేటు పాట్స్‌ను చూసేవాడని.. ఆ తర్వాత వాటిపై తన్నేవాడని పోలీసు విచారణలో తెలిసింది. వారం తర్వాత మరో మహిళను హత్య చేశాడు. వాచ్‌మెన్‌లు అయితే సెక్యూరిటీ తక్కువ ఉంటుందని వాళ్లని ఎంచుకునేవాడు.



    కొద్ది నెలల నుంచి రాంబాబు మానసిక ఆరోగ్య పరిస్థితి బాగాలేదని.. అంతకు ముందు అద్దెకు ఉన్న ఇంట్లో క్షుద్ర పూజలు చేసేవాడని, దేవుడు వస్తున్నాడంటూ పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తుండటంతో ఓనర్స్ ఇంటికి తాళం వేసి పంపించేశారని పోలీసులు తెలిపారు. రాంబాబు కూతురు, కొడుకు ఇద్దరూ కూడా దగ్గరకు రానివ్వకపోవడంతో ఇలా తిరుగుతూ హత్యలు చేయడం ప్రారంభించాడని చెప్పారు.  ఆదివారం జరిగిన హత్య నేపథ్యంలో పూర్తి నిఘా పెట్టిన పోలీసులు.. ఘటనా స్థలం దగ్గరలో ఉన్న పొదల్లో నుంచి వస్తున్న సమయంలో ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. ఆ తర్వాత అదుపులోకి తీసుకుని విచారించారు. గతంలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పని చేయడమే కాకుండా.. ఆటో కూడా నడిపేవాడని విచారణలో తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుగుతోందని సీపీ శ్రీకాంత్ వివరించారు.
    First published:

    Tags: Crime news, Illegal affairs, Murder, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు