SVBC: ఎస్వీబీసీ చానల్‌లో పోర్న్ వీడియో ఘటనలో అటెండర్ అరెస్ట్

ప్రతీకాత్మక చిత్రం

శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌ నుంచి ఓ భక్తుడికి పోర్న్ వీడియో లింక్ పంపిన అటెండర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Share this:
    తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో నడిచే శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌ నుంచి ఓ భక్తుడికి పోర్న్ వీడియో లింక్ పంపిన అటెండర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే అటెండర్ ని విధులు నుంచి తొలగించిన ఎస్వీబీసీ యాజమాన్యం. మరోవైపు ఎస్వీబీసీ కార్యాలయంలో సైబర్ టీం విచారణ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం. సైబర్ టీం నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీకి ఓ భక్తుడు మెయిల్ చేశాడు. ఆ భక్తుడికి ఎస్వీబీసీ ఉద్యోగి ఓ పోర్న్‌ సైట్‌ వీడియోను పంపాడు. దీంతో అవాక్కైన ఆ భక్తుడు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డిలకు ఫిర్యాదు చేశాడు. దీనిపై వారిద్దరు సీరియస్‌ అయ్యి విచారణకు ఆదేశించారు. ఎస్వీబీసీ కార్యాలయంలో టీటీడీ విజిలెన్స్, సైబర్ క్రైమ్ టీం, ఈడీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. పోర్న్‌ సైట్ వీడియో పంపిన ఉద్యోగితో పాటు కార్యాలయంలో అలాంటి సైట్లు చూస్తున్న ఉద్యోగులను సైబర్ క్రైమ్ టీమ్ గుర్తించింది. వీరితో పాటు కార్యాలయంలో విధులు నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని సైబర్ క్రైమ్‌ టీమ్‌ గుర్తించింది.

    మరోవైపు తప్పులు చెయ్యడం, ఆ తరువాత క్షమాపణలు చెప్పి సరిద్దిదుకోవడం టీటీడీ సర్వసాధారణంగా మారిపోతోందని ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ ధీయోధర్ విమర్శించారు. సునీల్ ధియోధర్ శ్రీవేంకటేశ్వరుని సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల సునీల్ ధియోధర్ మీడియాతో మాట్లాడుతూ... టీటీడీ అధికారిక ఎస్వీబీసీ ఛానెల్ లో అసాంఘిక ఘటనలు చోటుచేసుకోవడం చాలా బాధాకరమని అన్నారు. అయోధ్య భూమి పూజను కూడా ఎస్వీబీసీ ప్రసారం చెయ్యలేదని గుర్తుచేశారు. ఇకనైనా ఎస్వీబీసీ లో ఇలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఆస్తులు, నిధులను ప్రభుత్వం కాపాడాలని సూచించారు. ధనత్రయోదశి నాడు శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

    శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండి ఆదాయం..
    ఇక తిరుమల శ్రీవారికి ఈరోజు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. ఇవాళ శ్రీవారికి హుండి ద్వారా రూ.3.26 కోట్లు కానుకలుగా సమర్పించుకున్నారు భక్తులు. లాక్ డౌన్ అనంతరం శ్రీవారి ఆలయంలో దర్శనాలు పునరుద్ధరణ చేసిన తరువాత ఇదే అత్యధిక హుండి ఆదాయం.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: