• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • POLICE AND YSRCP MLA KAKANI GOVARDHAN REDDY CLARIFIES ON AYURVEDA MEDICINE ANANDAIAH ARREST IN ANDHRA PRADESH AK

కరోనాకు ఆయుర్వేద మందు ఇస్తున్న ఆనందయ్య అరెస్ట్.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

కరోనాకు ఆయుర్వేద మందు ఇస్తున్న ఆనందయ్య అరెస్ట్.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

ఆనందయ్య (ఫైల్ ఫోటో)

Ayurvedha Anandaiah: ఆయుర్వేద మందు ఇస్తున్న ఆనందయ్యను జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించడం చర్చనీయాంశంగా మారింది.

  • Share this:
    ఏపీలో ఇప్పుడు కరోనా కంటే ఎక్కువగా ఈ వైరస్‌కు ఆయుర్వేద మందు ఇస్తున్న నెల్లూరు జిల్లా ఆనందయ్య గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు కారణంగా కరోనా రోగులు త్వరగా కోలుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఏపీలోని పలు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కరోనా బాధితులు, ప్రజలు వేల సంఖ్యలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చేరుకుంటున్నారు. అయితే ఆనందయ్య ఇస్తున్న మందు గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో.. దీనిపై భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి.

    ఏకంగా విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లడంతో.. ఆయన ఇస్తున్న మందుల కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనే అంశంపై ఐసీఎంఆర్ దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. దీంతో ఐసీఎంఆర్ బృందంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆయుష్ కమిషనర్ బృందం కృష్ణపట్నంకు చేరుకుని ఆయన ఇస్తున్న మందు తయారీ కోసం వాడుకున్న ముడిసరుకులను పరిశీలించింది. దీనిపై మరింత లోతైన పరిశీలిన కోసం రాష్ట్ర స్థాయి ల్యాబ్స్‌కు పంపాలని అధికారులు నిర్ణయించారు. దీంతో అప్పటివరకు ఈ మందు పంపిణీని ఆపాలని నిర్ణయించినట్టు నెల్లూరు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

    మరోవైపు ఆయుర్వేద మందు ఇస్తున్న ఆనందయ్యను జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించడం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో భౌతిక దూరం పాటించలేదని ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఆనందయ్యను అరెస్ట్ చేశారా లేక ఆయనకు భద్రత కల్పించేందుకు తీసుకెళ్లారా ? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే ఆనందయ్యకు భద్రత కల్పించేందుకు ఆయనను అక్కడికి తీసుకెళ్లామని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఆనందయ్యను పోలీసులు అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు