Home /News /andhra-pradesh /

పోలవరం ప్రాజెక్టుకు వైఎస్సార్ పేరు...?

పోలవరం ప్రాజెక్టుకు వైఎస్సార్ పేరు...?

పోలవరం ప్రాజెక్టు

పోలవరం ప్రాజెక్టు

ప్రాజెక్టు సైట్‌ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు, భూసేకరణ, నిర్వాసితులకు భూముల కేటాయింపులు అన్నీ కూడా వైఎస్ హయాంవేనని ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటారు.

    ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టుకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని పలువురు వైఎస్సార్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన నేత సత్యం యాదవ్ పోలవరం ప్రాజెక్టుకు వైఎస్సార్ పేరు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు వైఎస్ హయాంలోనే ప్రారంభం అయ్యాయని, పోలవరం ప్రాజెక్టు వైఎస్సార్ చిరకాల వాంఛ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వరంగా పేర్కొనే పోలవరం ప్రాజెక్టుకు వైఎస్సార్ పేరు పెడితేనే సార్థకత ఉంటుందని అన్నారు.

    ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టుతో వైఎస్సార్ కు అవినావ బంధం ఉంది. ప్రాజెక్టు సైట్‌ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు, భూసేకరణ, నిర్వాసితులకు భూముల కేటాయింపులు అన్నీ కూడా వైఎస్ హయాంవేనని ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటారు. అంతే కాదు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర జల సంఘానికి కూడా ఆయన వినతిపత్రం సమర్పించారని వైఎస్ సన్నిహితులు పేర్కొంటున్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు వైఎస్సార్ ప్రాజెక్టుగా పేరు పెట్టే అవకాశాలు లేకపోలేదని పార్టీలోని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Polavaram, YSR, YSR Biopic Yathra, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు